Sunday, August 2, 2020

శివోహం

దారులన్నీ మూసుకుపోతున్నప్పుడు,
తానే ఓ దారై, వెలుగు చూపేవాడు నా మహాదేవుడు...

శంబుడి కన్నా మంచి స్నేహితుడు ఎవరు ఉన్నారు నాకు...

అందుకే స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మహాదేవ్...

Saturday, August 1, 2020

అయ్యప్ప

నా గుండె గూటిలో వెలిగే దివ్యజ్యోతివి నీవు...
నీవెలుగే(మకరజ్యోతి) నా అడుగులకు దిక్సూచి...

హరిహర పుత్ర శరణు....

శివోహం

తండ్రీ
శివప్పా 

నిన్ను 
దర్శించాలంటే 
నిన్ను 
ప్రశ్నించాలి 

నిన్ను 
ప్రశ్నించాలంటే 
నిన్ను 
దర్శించాలి 

శివోహం  శివోహం

శివోహం

మహాలక్ష్మీ

అంబానీల
అంబారీలలో విహరిస్తున్న నీకు

అన్నార్థుల ఆకలి కేకలు
వినిపిస్తున్నాయో కనిపిస్తున్నాయో

నాకైతే తెలియదు మరి
ప్రతి పేదవాని గుండె చప్పుడు ఇది

శివోహం  శివోహం

శివోహం

రోదనలన్నీ
నీ నందీశ్వరుని రంకెలలో
కలసి పోతున్నాయి

కన్నీటి ధారలన్నీ 
నీ గంగా ప్రవాహాలలో 
కొట్టుకు పోతున్నాయి

మరి  
నిన్ను ఎలా కలిసేది తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా!నీ ప్రతిరూప జగతిలో ఒక రూపం గా నేను
ప్రభవిస్తూ నీవు పరిభ్రమణిస్తూ నేను
ఎన్నాళ్ళు ఇలా అభిషేకిస్తూ నా కన్నీళ్ళు.
మహేశా . . . . . శరణు .

శివోహం

కట్టె కొనల కాడ...
కడ చూపులేల రా శివ...
కాలిపోక ముందు...
నా కనులు తెరిపించు...
నిన్ను చూపించు...

మహాదేవా శంభో శరణు

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...