చీమ నుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Thursday, September 24, 2020
శివోహం
భగవంతుడి నామస్మరణే భక్తులను రక్షిస్తుంది
భగవంతుడు అనే మాటే పలకడానికీ ... వినడానికి ఎంతో బాగుంటుంది. కష్టాల్లోను ... నష్టాల్లోను భగవంతుడా ఏమిటీ ఈ పరీక్ష! అని ఆయనని తలచుకోవడం జరుగుతూ వుంటుంది. భగవంతుడా అని ఆయనని అనుకోవడంతోనే మనసు తేలికపడుతుంది. అలాంటి భగవంతుడు అనేక నామాలతో పిలవబడుతుంటాడు ... కోట్లాది భక్తులతో కొలవబడుతుంటాడు.
అనంతమైన ఈ విశ్వమంతా వ్యాపించి వున్న భగవంతుడికి రూపాన్ని ఏర్పాటు చేసుకుని, ఆయనకిగల శక్తులనుబట్టి వివిధ నామాలతో పూజిస్తూ వుంటారు. అందువల్లనే భగవంతుడి ప్రతినామం శక్తిమంతమైనదే ... మహిమగలదేనని అంటారు. అలాంటి నామాలలో ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు పదేపదే స్మరించుకుంటూ వుంటారు. ఈశ్వర ... పరమేశ్వర .. ఉమామహేశ్వర అనీ, కేశవా .. నారాయణ .. మాధవ .. వాసుదేవా అని తలచుకుంటూ వుంటారు.
ఎవరికి ఇష్టమైన నామాన్ని వాళ్లు సదా స్మరిస్తూ వుండటం వలన, ఏదైనా ఆపద ఎదురైనప్పుడు అసహజంగానే ఆ నామం నోటివెంట వస్తుంది. భగవంతుడిని కదిలించడానికీ ... ఆయన కదిలిరావడానికి ఆ మాత్రం అవకాశం చాలు. కష్టాల్లో పడినప్పుడు ... ఆపదలో చిక్కుకున్నప్పుడు ఏ నామమైతే బయటికి వస్తుందో అది తప్పకుండా ఆ గండం నుంచి బయటపడేస్తుంది. ఒక రక్షణ కవచమై నిలిచి కాపాడుతుంది.
శివోహం
నీ నామం పలుకుతూ...
నీ పిలుపుకై అనుక్షణం..
నిరీక్షిస్తున్నా వాడిని నేను..
నీవు జగత్తును రక్షించేవాడవు..
జగత్తుకు శాసించే జ్యోతిర్మయుడు విశ్వరూపుడు నీవు..
నా నామం ఒక్కసారి పలకలెవా శివ...
Wednesday, September 23, 2020
శివోహం
నీలో ఉన్న తేజాన్ని నేనని...
అహం చూపానో ఏమో...
నీ నుండి దూరం చేసి మాయ కప్పి
ఆటలాడుతున్నావు....
నిన్ను వీడి ఉండలేను...
ఈ జన్మల పరంపర ప్రవాహానికి
ఆనకట్టవేసి ఆదుకోవా...
నీ ఒడిని చేర్చుకోవా..
శివోహం
గుప్పెడు కూడా లేని నా గుండె...
నీకు ఓ ఆలయం అయింది...
నీ మైమరపులో నా మనసు మునిగి...
నీ తన్మయత్వంతో తేలియాడుతుంది...
Subscribe to:
Posts (Atom)
శివోహం
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...
-
శివ! ఎన్నాళ్లని చూడాలి... నీ సన్నిధి చేరుటకు ఎన్నేళ్లని ఎదురు చూడాలి... కర్మ శేషం కొరకు కాలం తో పయనం ఇంకెంత కాలం. శూన్య స్థితం కొరకు జీవ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి అజ్ఞాన అంధ వినాశ ...
-
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! సకల ఘటనలను సులువుగా రచియించి, అందులో తోసేవు మమ్ములను తోలుబొమ్మలను చేసి, ఆ పాత్రదా...