Saturday, September 26, 2020

శివోహం

నాలో 
నిగూఢమైన 

నీ నామమేదో 
నిలదీస్తూ ఉంటుంది తండ్రీ 

నీ 
నామ స్మరణ చేయమనీ

" ఓం నమః శివాయ "

శివోహం  శివోహం

శివోహం

అవును గత 35 సంవత్సరాలుగా నేను ప్రతిరోజు రాత్రి మరణిస్తున్నాను...

మహాదేవుడి దయతో మరుసటి రోజు ఉదయనే ఊపిరి పోసుకుంటాను...

పడుకున్న మనిషి లెవలన్నా...
లేచి ఉన్న మనిషిని పెడుకోబెట్టాలన్న శంబుడని మించిన ఘనుడు లేడు మీరు నమ్మి తీరాల్సిందే...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

అంతటా 
ఆద్యంతాలుగా
నిండి ఉన్నావు

అణువు 
అణువునా 
నీవే అగుపిస్తున్నావు

ఆదియూ నీవే
అంతమూ నీవే 
అండ బ్రహ్మాండమూ నీవే తండ్రీ

శివోహం  శివోహం

శివోహం

శివా! ఎదురు చూపుకు ఎదురు కావు
ఎదను చూపులు నాకు రావు 
ఎఱుక చేయి మరి నాకేలా....?
మహేశా ..... శరణు.

Friday, September 25, 2020

శివోహం

ఎక్కడ నీ బలగం...
ఎక్కడ నీ చుట్టాలు...
ఎక్కడ నీ భార్య/భర్త పిల్లలు...
ఎక్కడ నీ అమ్మ నాన్న, నీ స్నేహితులు...
ఎక్కడ నీ ధనం, నీ నగలు, నీ ఆస్తి...
ఇకనైనా మారండి...
మంచి మనిషిగా బతకండి...
డబ్బులు, నగలు శాశ్వతం కాదురా...
మంచి పేరు కలకాలం ఉండును రా...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

విశాల విశ్వంలో 
విశ్వనాథుడు తప్ప 
వేరెవరూ తోడు లేని 
విగత జీవిని నేను 

అడిగానా 
ఈ వేదనలను
ఆశించానా 
ఈ వేడుకలను 

ఎవరి కోసం 
ఈ జనన మరణ చక్రాలు
మరెవరి కోసం 
ఈ పాప పుణ్య ఫలితాలు

ఆటంటే 
సమ ఉజ్జీలు ఆడేది 
నిస్సహాయున్ని నేను
సమానమని ఎలా అనుకున్నావు

నన్ను ఓడిస్తూ 
నీవు గెలుస్తూన్న ప్రతీ క్షణం
నా కంట తడి ఆర్తిని 
అంతరంగపు అభిషేకంగా

కను సన్నల లోనే దాచుకుని
కైలాసం లోని నీ పద సన్నిధిపై
నీకు మాత్రమే అందివ్వాలనే
వెర్రి మా లోకాన్ని నేను

కానీ
ఆ కన్నీటిని కూడా వదలక
వల్ల కాటిలోనే కాల్చేస్తూ
కూల్చేస్తూ కరిగిస్తూ ఉంటే

ఇప్పటి వరకూ తెలియదు
ఆ నీటి లోనే నిప్పు ఉందనీ
ఆ కన్నీటి లోనే
నీ త్రినేత్రం దాగి ఉందనీ

శివోహం  శివోహం

శివోహం

శివా!ఈర్ష అన్నది ఇలకే పరిమితమనుకున్నా
పరమునకు కూడా పొంగిందా  ...
బాలుని మాయం చేసి మా గుండెకు గాయం చేసారు
మహేశా . . . . . శరణు .

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...