Friday, September 25, 2020

శివోహం

విశాల విశ్వంలో 
విశ్వనాథుడు తప్ప 
వేరెవరూ తోడు లేని 
విగత జీవిని నేను 

అడిగానా 
ఈ వేదనలను
ఆశించానా 
ఈ వేడుకలను 

ఎవరి కోసం 
ఈ జనన మరణ చక్రాలు
మరెవరి కోసం 
ఈ పాప పుణ్య ఫలితాలు

ఆటంటే 
సమ ఉజ్జీలు ఆడేది 
నిస్సహాయున్ని నేను
సమానమని ఎలా అనుకున్నావు

నన్ను ఓడిస్తూ 
నీవు గెలుస్తూన్న ప్రతీ క్షణం
నా కంట తడి ఆర్తిని 
అంతరంగపు అభిషేకంగా

కను సన్నల లోనే దాచుకుని
కైలాసం లోని నీ పద సన్నిధిపై
నీకు మాత్రమే అందివ్వాలనే
వెర్రి మా లోకాన్ని నేను

కానీ
ఆ కన్నీటిని కూడా వదలక
వల్ల కాటిలోనే కాల్చేస్తూ
కూల్చేస్తూ కరిగిస్తూ ఉంటే

ఇప్పటి వరకూ తెలియదు
ఆ నీటి లోనే నిప్పు ఉందనీ
ఆ కన్నీటి లోనే
నీ త్రినేత్రం దాగి ఉందనీ

శివోహం  శివోహం

No comments:

Post a Comment

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...