Saturday, October 3, 2020

శివోహం

శివా ! సమస్త జీవకోటిని 
ఆదరించి అనుగ్రహించే మహదేవా... 
పరమదయామయా... భక్తవత్సలా... 
నాలోని లోపాలు తొలగించి... 
పాపాలు నశింపజేసి... 
నీ దివ్యానుగ్రహం అందించు... 
తండ్రీ సోమనాథా... !! 
చంద్రశేఖరా... 
పాహిమామ్ రక్షమామ్...

శివోహం

శివా ! సర్వ జ్ఞానివి... 
సమస్త లోకాలను ఏలే వాడవు... 
సకల శుభాలను ఇచ్చేవాడవు... 
సకలమూ ఎరిగిన వాడవు... 
సమస్తమూ వ్యాపించిన... 
ఆనంద తాండవ నటరాజా... 
మాత బాలాత్రిపురసుందరిదేవితో 
కూడి నాకు జ్ఞానఐశ్వైర్యాన్ని ప్రసాదించుము... 
నన్ను అనుగ్రహించుము తండ్రీ...

శివోహం

శివా!నాలో నీవుంటే ధ్వనిస్తాను
నాలో నీవు లేకుంటే జ్వలిస్తాను
జ్వాలయినా,జ్యోతయినా నీవే
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా నోట, నా నుదుట నీ నామమే
నా శ్వాస,స్మరణములందు నీ మంత్రమే
చితి చిత్తములందు నీ తేజమే
మహేశా ..... శరణు.

శివోహం

శివా! చిత్తంలో చిరు జ్యోతివి
బాహ్యంలో బ్రహ్మాండ తేజానివి
అంతటా ఆవరించి అగుపించకున్నావు
మహేశా ..... శరణు.

Thursday, October 1, 2020

శివోహం

నా హృదయంలో ఉన్న ఆత్మను దర్శింప జేసుకోవడానికి...

శరీరమనే ప్రమిదలో నిష్ఠ అనే నూనె వేసి....

వత్తి అనే బుద్ధితో జ్ఞానమనే జ్యోతిని వెలిగించా...

ఇక నీ దయ...

మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా! నా నోట, నా నుదుట నీ నామమే
నా శ్వాస,స్మరణములందు నీ మంత్రమే
చితి చిత్తములందు నీ తేజమే
మహేశా ..... శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...