Sunday, October 11, 2020

శివోహం

వెండికొండలో ఉండు వేదవిదుడవు నీవు... 

మూడుకన్ను లుండి ముల్లోకములను...
యేలే గరళకంఠడవు నీవు....

నిర్మలా హృదయ దయాంతరంగుడు....
విభూతినమేయుడు నీవే కదా తండ్రి....

మహాదేవా శంభో శరణు....

Saturday, October 10, 2020

అయ్యప్ప

ఉదయ భానుడు వచ్చి చాలా సేపైంది...

ఉదయాన్నే నా ఇంటికి వస్తానని కలలో మాటిచ్చావు...

వేకువ రేఖలు తూర్పు తలుపుల వాకిట సవ్వడి
చేయక ముందునుంచే నీకోసం ఎదురు చూస్తున్నాను...

శబరిగిరి దిగిరా తండ్రి నా కన్నీటి సంద్రం లో జలకమడిపో....

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!పొగడ్త తెగడ్తలు నీకు పట్టవాయె
పంచభూతములు నిన్ను పట్టలేవాయె
నిన్ను పట్టి కట్టగలది ఆ భక్తియొకటే
మహేశా . . . . . శరణు .

శివోహం

రంగుల రాట్నం వలె మాయలెన్నొ కలిపించి...
చిన్న చిన్న ఆశలతో నా చిత్తమునే చేరిపేసి...
నా చేత తప్పులు చేయ అజ్ఞాపించి...
నీ నుండి దూరం చేయకు ...
నీ దగ్గర రప్పించుకో నీ పాదాల దగ్గరే పడివుంటా...
మహాదేవా శంభో శరణు....

Friday, October 9, 2020

శివోహం

మనసెందుకో బరువవుతోంది....
తెరలు తెరలుగా ఆవేదన.....
నేను నాది అను భావన తో... 
దుఃఖమును అనుభవించుచున్నాను....
అహం స్వార్థం తో కూడిన నా మనస్సు....
అనే విచిత్రవస్తువు నీకు అర్పిస్తాను....
స్వీకరించి నా మనస్సును ఆనందపర్చు....
మహాదేవా శంభో శరణు....

శివోహం

శివా! గుడి నుండి ఒడికి ఒడి నుండి గుడికి
విరామం లేకుండా తిరుగుడే తిరుగుడు 
ఎన్నాళ్ళీ తిరుగుడు దీనికేది విరుగుడు
మహేశా ..... శరణు

హరే క్రిష్ణ

ప్రణయ భక్తి మార్గములో
పయనించే దాసుడ్ని నేను
గమ్యమునకు చేర్చి నన్ను
కనికరింపవోయి ఓ కృష్ణా!

కోనలోని కోకిల వలె
కొసరి పలుకు నా నాదము
నీ స్వరములయందు కలిసి
నిర్మలమై మాసిపోవా!

కన్నులయందు కదలాడే
కమనీయపు నా రూపున
నిలిచిపోవా, కలిసిపోవా
నీరాజాక్ష కరుణింపుము!

మధుర వేదనల సెగలను
మసిలిపోవు నా హృదయము
చందనమై నీ పదముల
చిందునటుల దయచూడుము!

భస్మమైన నా చితిపై
బంగారపు మురళి ఉంచి
ఒక్కసారి నన్ను తలచి
అలవోకగా పోయు కరుణాశ్రువు!

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...