ఈశ్వరుడు అనంత వైభవము కలవాడు
అలాగే ఈశ్వర నామము కూడా అనంత
వైభవంతో శోభిస్తుంది ........
కాని సాధకులకు ఉపయుక్తంగాను
సులభ సాధ్యం గాను ఉండటానికి
సహస్ర నామాలుగా నిర్ణయించి
స్తోత్రాలను అందించారు
మన ఋషయ జ్ఞానులు...
భగవంతుని రూపాన్ని చూడగానే
ఇంద్రియాలు శాంతిస్తున్నాయి
మనస్సు ప్రశాంతతను పొందుతుంది
పరమేశ్వరుని నామాలను కీర్తించగానే
బుద్ధికి ప్రశాంతత చేకూరుతూ ఉంది
హృదయంలో ఏదో హాయిని.ఆహ్లాదాన్ని
అనుభవిస్తోంది ఇది పారమార్థిక ప్రగతికి
దోహద పడుతుంది ............!!
నామరూపాలలో నామం ఎక్కువ
శక్తివంత మైనది నామానికి ఉన్నంత
శక్తి రూపానికి ఉండదు !చాలా కాలం
క్రితం చూసిన వ్యక్తిని గుర్తు తెచ్చుకొనే
సమయంలోఅతని పేరు జ్ఞాపకం మొస్తుంది
రూపం స్పష్టంగా విదితం కాదు అతను
నాకు తెలుసు కానీ అతని రూపమే
జ్ఞాపకం రావడం లేదు అంటూ ఉంటాము
అంతే కాదు ఒక వ్యక్తి జీవితంలో
అతని రూపం దశాబ్దానికి దశాబ్దానికి
గొప్ప మార్పుతో కనిపిస్తూ ఉంటుంది
కాని శతాబ్దం జీవించినా నామం మారదు
భగవన్నామం పవిత్రమైనది
పాపాన్ని సమూలంగా ప్రక్షాళనం చేస్తుంది
నామాన్ని ఎప్పుడైనా చేయవచ్చు
ఎక్కడైనా చెయ్యవచ్చు
ఎవ్వరైనాచెయ్యవచ్చు
నామసాధన సులభ మైనది
నిరపాయ మైనది మధుర మైనది
మరపు రానిది అందుకనే
సకల సాధనలలో నామానికి
అగ్రతాంబూలం అందింది
నామంలో నామి వైభవము
స్తుతియే ప్రధానంగా ఉండటం చేత
నామసాధన అధిక్య మని చెప్పబడింది