Wednesday, November 25, 2020

శివోహం

శివా!ఆశల సౌధం ఆహుతయ్యేలోగా
నీవు ఒకసారి అనిపించు చాలు
అది కూర్చును కదా ఎంతో  మేలు
మహేశా . . . . . శరణు .

శివోహం

శుష్కించి 
శిథిలమయ్యే శరీరం
నీకు ఆవాసమా ?

దహించబడి 
ధూళిగా మారిపోయే  దేహం
నీకు అభిషేకమా ??

తెలియని సత్యం 
నీ వేదాంతంగా !

తెలిసిన ధర్మం 
నీ వైరాగ్యంగా !!

శివోహం  శివోహం

శివోహం

ఈశ్వరుడు మిమ్ములను స్మరించకపోతే 
మీరు ఈశ్వరుని స్మరించలేరు.
అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనే తలంపే మీకు పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంటే 
ఈశ్వర సంకల్పం మీ మీద ఉన్నట్లే!

భగవాన్ రమణ మహర్షి

శివోహం

పిచ్చివాడివో  వెర్రివాడివో
తిక్కలోడివో  తెలియనోడివో 

జడలు కట్టు  ఆ జటలు ఏలనో
నెత్తి మీద  ఆ గంగ ఏలనో 

వంక బూనిన  జాబిలేలనో
మెడను చుట్టు  ఆ పాములేలనో 

మూడు కన్నుల  మర్మమేలనో
మౌన ముద్ర  ఆ ధ్యానమేలనో 

జనన మరణాల   చక్రమేలనో
కట్టె కొనల  ఆ చితులు ఏలనో 

భిక్షమెత్తు  ఆ బ్రతుకు ఏలనో 
కాటి కాపరి  కొలువు ఏలనో 

ఒంటి నిండా  ఆ బూడిదేలనో
తెలియరాని  ఆ తత్వమేలనో 

శివోహం  శివోహం

Tuesday, November 24, 2020

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది అయ్యప్ప దీక్ష

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

ఈశ్వరుడు అనంత వైభవము కలవాడు
అలాగే ఈశ్వర నామము కూడా అనంత
వైభవంతో శోభిస్తుంది  ........

కాని  సాధకులకు ఉపయుక్తంగాను 
సులభ సాధ్యం గాను ఉండటానికి 
సహస్ర నామాలుగా నిర్ణయించి 
స్తోత్రాలను అందించారు 
మన  ఋషయ జ్ఞానులు...

భగవంతుని రూపాన్ని చూడగానే
ఇంద్రియాలు శాంతిస్తున్నాయి
మనస్సు ప్రశాంతతను పొందుతుంది
పరమేశ్వరుని నామాలను కీర్తించగానే
బుద్ధికి ప్రశాంతత చేకూరుతూ ఉంది
హృదయంలో ఏదో హాయిని.ఆహ్లాదాన్ని
అనుభవిస్తోంది ఇది పారమార్థిక ప్రగతికి
దోహద పడుతుంది  ............!!

నామరూపాలలో నామం ఎక్కువ 
శక్తివంత మైనది నామానికి ఉన్నంత 
శక్తి  రూపానికి ఉండదు !చాలా కాలం 
క్రితం చూసిన వ్యక్తిని గుర్తు తెచ్చుకొనే 
సమయంలోఅతని పేరు జ్ఞాపకం మొస్తుంది
రూపం స్పష్టంగా విదితం కాదు అతను 
నాకు తెలుసు కానీ అతని రూపమే 
జ్ఞాపకం రావడం లేదు అంటూ ఉంటాము
అంతే కాదు ఒక వ్యక్తి జీవితంలో
అతని రూపం దశాబ్దానికి దశాబ్దానికి
గొప్ప మార్పుతో కనిపిస్తూ ఉంటుంది
కాని శతాబ్దం జీవించినా నామం మారదు

భగవన్నామం పవిత్రమైనది
పాపాన్ని సమూలంగా ప్రక్షాళనం చేస్తుంది
నామాన్ని ఎప్పుడైనా చేయవచ్చు
ఎక్కడైనా చెయ్యవచ్చు
ఎవ్వరైనాచెయ్యవచ్చు
నామసాధన సులభ మైనది
నిరపాయ మైనది మధుర మైనది
మరపు రానిది అందుకనే 
సకల సాధనలలో నామానికి
అగ్రతాంబూలం అందింది
నామంలో నామి వైభవము
స్తుతియే ప్రధానంగా ఉండటం చేత
నామసాధన అధిక్య మని చెప్పబడింది

శివోహం

భౌతికంగా ఉన్న దూరం
మానసికంగా దగ్గర అవుతుంది తండ్రి...

అందుకే నా గుండెల్లో ఉండిపో...
అప్పుడు శ్వాస దూరంలో ఉంటావు...

ఊపిరి పీల్చకుండా ఉండలేను
నిను తలవకుండా గడప దాటలెను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.