Thursday, November 26, 2020

శివోహం

వేగిరపడుతున్న ఈ మనసుని
నువ్వు ఎప్పుడు 
ఆదరిస్తావు స్వామి!!
నీ అడుగుల తివాచీలా
 ఉబలాటపడి పరిచిన 
 హృదయ సీమకి
నువ్వు వచ్చేవని,
 అంతా నీ అడుగుల 
అచ్చులే ముద్రితమని
తెలిసేరోజు కోసం
 ఈ జీవిత సమస్తం
 వేచిఉన్నది,
 ధర్మానికి వేదిక.... 
నీ ముందర ఉండడమే
నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా 
మారి ఉన్నాను,
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి 
దాటెందుకు నీచేయూతలో
 నాలోనుండి
 నాలోకి 
ప్రయాణించే 
గమనాన్ని 
వేగంగా మార్చు,
మరెక్కడ ఆగకుండా
నిన్ను చేరేందుకు
ఉరవడి ఉండనీ 
గట్లు తెగిపోయి స్వామి...

Wednesday, November 25, 2020

శివోహం

అనుకున్నామని జరగవు అన్ని...
అనకోలేదని ఆగవు కొన్ని...
జరిగేవన్నీ శివుని చిత్తమని అనుకోవడమే మంచిది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివా!ఆశల సౌధం ఆహుతయ్యేలోగా
నీవు ఒకసారి అనిపించు చాలు
అది కూర్చును కదా ఎంతో  మేలు
మహేశా . . . . . శరణు .

శివోహం

శుష్కించి 
శిథిలమయ్యే శరీరం
నీకు ఆవాసమా ?

దహించబడి 
ధూళిగా మారిపోయే  దేహం
నీకు అభిషేకమా ??

తెలియని సత్యం 
నీ వేదాంతంగా !

తెలిసిన ధర్మం 
నీ వైరాగ్యంగా !!

శివోహం  శివోహం

శివోహం

ఈశ్వరుడు మిమ్ములను స్మరించకపోతే 
మీరు ఈశ్వరుని స్మరించలేరు.
అసలు ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలనే తలంపే మీకు పుట్టదు. సత్యాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక మీకు కలుగుతుంటే 
ఈశ్వర సంకల్పం మీ మీద ఉన్నట్లే!

భగవాన్ రమణ మహర్షి

శివోహం

పిచ్చివాడివో  వెర్రివాడివో
తిక్కలోడివో  తెలియనోడివో 

జడలు కట్టు  ఆ జటలు ఏలనో
నెత్తి మీద  ఆ గంగ ఏలనో 

వంక బూనిన  జాబిలేలనో
మెడను చుట్టు  ఆ పాములేలనో 

మూడు కన్నుల  మర్మమేలనో
మౌన ముద్ర  ఆ ధ్యానమేలనో 

జనన మరణాల   చక్రమేలనో
కట్టె కొనల  ఆ చితులు ఏలనో 

భిక్షమెత్తు  ఆ బ్రతుకు ఏలనో 
కాటి కాపరి  కొలువు ఏలనో 

ఒంటి నిండా  ఆ బూడిదేలనో
తెలియరాని  ఆ తత్వమేలనో 

శివోహం  శివోహం

Tuesday, November 24, 2020

శివోహం

ఐహిక భోగం విడిచేది
ఐహిక భోగం మరిచేది
మమకారములను విడిచేది
మదమత్సరములను తుంచేది అయ్యప్ప దీక్ష

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...