Saturday, November 28, 2020

శివోహం

మనకు అన్నీ భగవంతుడే ఇస్తే
ఆయనకు మనమేమి ఇవ్వగలం
అలాగని ఏమీ ఇవ్వకుండా ఉంటే
కృతజ్ఞత అవుతుంది కదా !
తల్లిదండ్రులు మనకు ఎన్నో ఇచ్చారు
మనం అనుభవిస్తున్న జీవితం
వారు అనుగ్రహించిందే
ఇంక వారికేమి ఇవ్వగలం
అలాగని వదిలేయలేం కదా !
వారియెడల భక్తిని కలిగి ఉండాలి
మనం ఏ చిన్న సేవ చేసినా
మురిసిపోతారు తల్లిదండ్రులు
భగవంతుడుకూడ అటువంటి
అల్పసంతోషియే ఏ కొంచెమిచ్చినా
పరమానంద పడిపోతాడు
అటువంటిది మననే కానుకగా
సమర్పిస్తే ఎంత మురిసిపోతాడు
అంటే బ్రహ్మస్మి అనే భావంతో
నీవే నేననుకో అనే భావాన్ని
వ్యక్తం చేయడమే నిజమైన కానుక

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ నీ భక్తియే ముక్తికి మార్గము...

మంచీ చెడ్డా,పాప పుణ్యా,భారమిక 
నీదే కదా తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, November 27, 2020

శివోహం

శివా!గమ్మత్తుగ మత్తు ఆవరించింది
కనులు మూత పడుతున్నాయి 
నీ కోసం వెతుకుతున్నాయి
మహేశా ..... శరణు.

Thursday, November 26, 2020

శివోహం

కన్న వారినీ కన్న భూమినీ...
ఎదో ఓ రోజు శుభ ముహూర్తం పెట్టి...
నువ్వు దూరం  చేస్తావని తెలిసి కూడా...
ఏరికోరి నిన్నే ఎంచుకున్న శంభో.
ఎందుకంటే చిట్టచివరికి నువ్వే తోడుంటావని...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! భవసాగరము దాట ఈత నేర్పించు
ముక్తి పదమున సాగ భక్తి నెరిగించు
నీ నామమే శ్వాసగా స్మరణలోనుంచు
మహేశా . . . . . శరణు .

శివోహం

వేగిరపడుతున్న ఈ మనసుని
నువ్వు ఎప్పుడు 
ఆదరిస్తావు స్వామి!!
నీ అడుగుల తివాచీలా
 ఉబలాటపడి పరిచిన 
 హృదయ సీమకి
నువ్వు వచ్చేవని,
 అంతా నీ అడుగుల 
అచ్చులే ముద్రితమని
తెలిసేరోజు కోసం
 ఈ జీవిత సమస్తం
 వేచిఉన్నది,
 ధర్మానికి వేదిక.... 
నీ ముందర ఉండడమే
నా ఆత్మకు కాంక్ష....
నేను అంతా నిరీక్షణగా 
మారి ఉన్నాను,
నీ ప్రతిక్ష పొందడమే పరమావధిగా
ఈ అనంత జలనిధి 
దాటెందుకు నీచేయూతలో
 నాలోనుండి
 నాలోకి 
ప్రయాణించే 
గమనాన్ని 
వేగంగా మార్చు,
మరెక్కడ ఆగకుండా
నిన్ను చేరేందుకు
ఉరవడి ఉండనీ 
గట్లు తెగిపోయి స్వామి...

Wednesday, November 25, 2020

శివోహం

అనుకున్నామని జరగవు అన్ని...
అనకోలేదని ఆగవు కొన్ని...
జరిగేవన్నీ శివుని చిత్తమని అనుకోవడమే మంచిది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.