Wednesday, December 2, 2020

శివోహం

శివా!కష్టాలు కల్పించి మనోధైర్యం పెంచావు
ప్రేమంటె రుచి చూపి భక్తిని పెంపు చేసేవు 
సాధన చేయగ నాలో సహనాన్ని పెంచేవు
మహేశా ..... శరణు.

Monday, November 30, 2020

శివోహం

దీపం జ్యోతి పరం బ్రహ్మ...
దీపం జ్యోతి మహేశ్వర...
దీపేన సాధ్యతే సర్వం...
సంధ్యాదేవి నమోస్తుతే...

Sunday, November 29, 2020

శివోహం

దీపం జ్యోతి పరం బ్రహ్మ...
దీపం జ్యోతి మహేశ్వర...
దీపేన సాధ్యతే సర్వం...
సంధ్యాదేవి నమోస్తుతే...

Saturday, November 28, 2020

ఓం

భగవంతుణ్ణి ఏ పేరుతో పిలవాలన్నది’ చాలామంది సందేహం. ‘భగవంతుడు ఓంకార వాచ్యుడు కనుక, అతణ్ణి ఓమ్‌ అని పిలిస్తే చాలని’ పతంజలి మహాశయుడు ‘యోగదర్శనం’లో చెప్పాడు. వాసుదేవుడుకూడా ‘భగవద్గీత’లో ‘ఓమిత్యే కాక్షరం బ్రహ్మ’ అని, ‘భగవంతుణ్ణి ‘ఓం’కార నామస్మరణతో భజించాలని’ ఉపదేశించాడు. ‘ఓం’ భగవంతుని నిజమైన నామమే కాక ముఖ్యనామం కూడా. ‘ఓం’కారానికి ఉన్న ప్రశస్తి ఇతర నామాలకు లేదు. ‘ఓమ్‌'లో మూడు వర్ణాలున్నాయి. ‘అ, ఉ, మ్‌' అనేవి. అవి భగవంతుని ‘సృష్టి, స్థితి, లయ’లకు ప్రతీక. వ్యాసులవారు ‘వేదాంత దర్శనం’లో ‘భగవంతుడు ఎవరు?’ అన్న ప్రశ్నకు సమాధానంగా ‘జన్మాద్యస్యయతః’ అని సూత్రీకరించాడు. ‘ఎవరివల్ల జన్మ (సృష్టి), దానితోపాటు స్థితి లయలు సంభవిస్తున్నాయో వారే భగవంతుడని’ ఆయన సెలవిచ్చాడు. పతంజలి, వ్యాసుడు మొదలైన మహర్షుల ప్రతిపాదన వేదానుగుణమైంది. ‘యజుర్వేదం’లోని 40వ అధ్యాయంలో ‘ఓం క్రతో స్మర’ అనే వాక్కు గమనింపదగింది.

సర్వే వేదా యత్‌ పదమామనంతి

తపాంసి సర్వాణిచ యద్‌ వదంతి

యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి

తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓమిత్యే తత్‌.

- కఠోపనిషత్తు (2-15)

‘తైత్తిరీయోపనిషత్తు’ మొదలుకొని అన్ని ఉపనిషత్తులూ మనకు శాంతి కలగాలని ‘ఓమ్‌ శాంతిః శాంతిః శాంతిః’ అనే మంత్రాన్ని ఉపదేశిస్తున్నాయి. నాలుగు వేదాలు దేన్ని పొందదగిందిగా వర్ణిస్తాయో, అన్ని తపస్సులు దేనిగురించి చెబుతున్నాయో, మోక్షార్థులు దేనికోసం ‘బ్రహ్మచర్య వ్రతాన్ని’ పాటిస్తారో ఆ పరబ్రహ్మ తత్తానికే ‘ఓమ్‌' అని పేరు. ‘ఓం’కారం భగవంతుని సహజనామం కాగా, ఇంకెన్నో పేర్లు భగవతత్తాన్ని తెలుపుతున్నాయి. భగవంతుడే సృష్టికర్త కనుక ‘సవిత’, విశ్వాన్నంతటినీ ప్రకాశింపజేస్తాడు కనుక ‘సూర్యుడు’. అంతటా వ్యాపకుడైన ‘పరమాత్మా’ ఆయనే. ప్రపంచాన్నే ఐశ్వర్యంగా కలిగినవాడు కనుక పరమేశ్వరుడు, జగత్తును క్రీడింపజేస్తూ, స్వయంగా ప్రకాశిస్తూ, ‘సచ్చిదానంద స్వరూపుడై’ ఉన్నాడు కాబట్టి, ‘దేవుడు’. సర్వజీవులలో అంతర్యామి అయినవాడు కనుక ‘నారాయణుడు’. ప్రాణికోటిని ఏడ్పించే ‘రుద్రుడు’, అన్నిటికంటే గొప్పవాడైన బ్రహ్మ ఆయనే. భగవంతుడు సకలైశ్వర్య సంపన్నుడై సేవింపదగినవాడు. అందువల్ల, ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఐతే, ‘ఓం’కారమే అతని సహజనామం అన్న దానిని మాత్రం మరవరాదు. 

భగవంతునిలో ఎన్నో సుగుణాలున్నాయి. కొన్ని పేర్లు వాటిని తెలియజేస్తాయి. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడే కాదు, అన్ని లోకాలకు ఈశుడతడు ఒక్కడే. అతనితో సమానులుగాని, మించినవారుగాని లేరు. అన్ని పదార్థాలలో, జీవులలో అతడున్నాడు. అలాగే, అన్ని పదార్థాలూ, జీవులూ అతనిలోనూ వున్నాయి. అతడే సృష్టికర్త కనుక ‘బ్రహ్మ’, పోషణకర్త కనుక ‘విష్ణువు’, లయకారుడు కనుక ‘రుద్రుడు’గా వ్యవహరిస్తున్నాం. ఆది-అంతం లేనివాడు కనుక ‘అనంతుడై’నాడు. అన్ని పేర్ల అర్థం ఒక్క ‘ఓం’కారంతోనే సిద్ధిస్తుంది. మన పూర్వికులు అన్నివేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ, ‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అన్నారు. మూడు లోకాలను పాలించేవాడే మూడు దుఃఖాలను (ఆధ్యాత్మికం: శరీర సంబంధం, ఆధిభౌతికం: తోటిప్రాణులవల్ల కలిగేది, ఆధిదైవికం: ప్రకృతి విపత్తులద్వారా ఏర్పడేది) పోగొడతాడు. ‘ఓం’కారంలోని ‘అ+ఉ+మ్‌' అనే మూడు మాత్రలు భగవంతుని మూడు వంతుల మహిమను మాత్రమే తెలియజేస్తాయి. నాల్గవ వంతు మహిమ ఎవరికీ అందదు. అందుకే, అతణ్ణి ‘ఓంకారాతీతుడనీ’ పిలుస్తాం. 

ఆచార్య మసన చెన్నప్ప

అయ్యప్ప

ఎన్ని జన్మల తపమో...
ఎన్నిజన్మల పుణ్య పలమో...
ఇరుముడు ఎత్తుకొని నిన్ను చేరి నీ దర్శన కోసం ఎదురు చూసిన నా జన్మ ధన్యము కదా మణికంఠ...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

శివా! నీ నాట్యానికి నా అహము వేదిక కానీ
నీ నామము నా పదమున దీపిక కానీ
నా గమనం నిన్ను చేరీ ముగిసిపోనీ
మహేశా.....శరణు.

శ్రీరామ

కార్యసాధకుడు కపీశ్వరుడు...

సుందరకాండ పారాయణ చేస్తే ఆగిపోయిన పనులు కూడా అయిపోతాయని లోకంలో ప్రతీతి. అలా చెప్పడంలో పెద్దల ఉద్దేశ్యం కేవలం పారాయణ చేసినంతలో ఏదో హనుమచ్చక్తి కిందికి దిగి వచ్చి మన పనులన్నీ చేసి పెట్టేస్తుందని కాదు. సుందరకాండ మొత్తం సావకాశంగా, సావధానంగా చదివితే..  కార్యసాధనలో ఎదురయ్యే ఆటంకాలు ఎన్ని రకాలుగా ఉంటాయో, వాటిని ఏ రకంగా తొలగించుకోవాలో అవగాహన చేసుకొంటారని పెద్దల ఉద్దేశం. ఏ విషయాన్నైనా అవగాహన చేసుకొని వాటిని మన జీవితానికి అన్వయం చేసుకొని ఆచరణలో పెడితే కాని పని ఉంటుందా? హనుమంతుడు సముద్రలంఘనం చేస్తుంటే మూడు రకాల ఆటంకాలేర్పడ్డాయి. మైనాక పర్వతం మర్యాద చేయడానికి అడ్డంగా వచ్చి నిలబడింది.

ఇది సాత్త్వికాటంకం. తర్వాత సురస అనే రాక్షసి ఆకాశమార్గానికి అడ్డంగా వచ్చి.. తన నోట్లో ప్రవేశించకుండా ఏ ప్రాణీ ముందుకు వెళ్లలేదని పంతం పట్టింది. ఇది రాజసాటంకం. ఆ తర్వాత సింహిక అనే ఛాయాగ్రాహిణి మాటామంతీ లేకుండా కిందికి లాగెయ్యడం మొదలుపెట్టింది. ఇది తామసాటంకం. కార్యసాధకుడైన హనుమంతుడు మూడు ఆటంకాలనీ మూడు రకాలుగా ఎదుర్కొన్నాడు. మైనాకుడు మర్యాదలు చెయ్యడం కోసం అడ్డుపడ్డాడు కాబట్టి.. అతనితో మర్యాదగానే మాట్లాడి, తిరిగివచ్చేటప్పుడు ఆగుతానని చెప్పి దాటి వెళ్లిపోయాడు. సురస ఆంజనేయుణ్ణి మింగేద్దామని నోరుతెరిచింది.

స్వామి దాంతో పోటీపడి దానికి రెట్టింపు స్థాయిలో శరీరం పెంచాడు. కొంతసేపయ్యాక సమయం వృథా అవుతోందని గమనించి.. అతి సూక్ష్మ శరీరంతో దాంట్లోంచి బయటపడ్డాడు. రాజసాటంకాల నుండి బయటపడే ఉపాయం అది. ఆ తర్వాత సింహిక.. ఆంజనేయుడి నీడ పట్టుకొని బలవంతంగా కిందికి లాగేస్తుంటే అది తమోగుణ ప్రవృత్తి అని గ్రహించి.. తన బలమంతా ఉపయోగించి దాన్ని పైకిలాగి ఒక్క గుద్దుతో పైలోకాలకి పంపేశాడు. అంటే తమో గుణానికి దండనతో బదులు చెప్పాడన్నమాట. అలామనం కూడా ఏదైనా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకొన్నప్పుడు ఎదురయ్యే ఆటంకాలు ఏ రకమైనవో గమనించుకొని ఆ రకమైన ప్రవృత్తితోనే వాటిని ఎదుర్కోవాలి. కొన్నింటిని మర్యాదగానే ప్రక్కకి తొలగించాలి. మరికొన్ని విషయాల్లో కొంతసేపు పోటీపడినా.. సూక్ష్మమైన ఉపాయాలను ఆలోచించి, ఆ పోటీ నుండి బయటపడి మన పని మనం చేసుకోవాలి. తీవ్రవాదం వంటి సమస్యలను అంతే తీవ్రంగా ఎదుర్కొని ఉక్కుపాదంతో అణచివేయాలి. అక్కడ మెతకదనం పనికిరాదు.

ఒక్క వ్యక్తి జీవితానికైనా, మొత్తం వ్యవస్థలో మార్పులకైనా ఈ త్రిగుణాత్మక వ్యూహం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ రకంగా సుందరకాండలో ఘట్టాల్ని అవగాహన చేసుకొని, మన జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడితే కాని పని అంటూ ఉంటుందా? అందుకోసం సుందరకాండ అందరూ చదవాలి. కపీశ్వరుని కార్యసాధకత్వాన్ని అవగాహన చేసుకొని అనుసరించాలి.
సేకరణ: ఆంధ్రజ్యోతి

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.