Wednesday, December 9, 2020

శివోహం

కృష్ణా నీ మోహన మనోహర రూపం చంద్రకాంతికే కొత్త అందాలని ఇచ్చింది....
 
నీ నీలిమేగ కాంతిని గని ఆ చంద్రుడు ఈ జగత్తు లో ఇంతకన్నా సౌందర్యం మొరొకటి లేదుకదా అని మురిసి పోతూ ఉన్నవేళ నీ దర్శన బాగ్యాన్ని నాకు కలిపించావు కృష్ణ ఇదియే పరమానందం కదా...

కనీసం వెదురును అయినా కాకపోతిని క్రిష్ణ...
నీ చేతిలో వేణువై శాశ్వతంగా నిలిచిపోవాడానికి...

రాధే క్రిష్ణ

శివోహం

రామా నామమును మించిన అమృతం మరొకటి లేదు...

జై శ్రీరామ్

శివోహం

నెత్తిన తైతక్కల గంగ...
నుదుటన నిప్పులుమిసే కన్ను...
కంఠాన విషపు కొలిమి మేన కాష్ఠపు బూది చాలవా నీవు...
బహు తిక్కల రేడు వని తెలుప ఈ విన్యాసమేలా...

మహాదేవా శంభో శరణు

Tuesday, December 8, 2020

శివోహం

శంభో!!!
సదా నీ రూప స్మరణము
నీ నామ శ్రవణం చేయ నేను తపించాలి 
సదా నిన్ను అర్చింప
నీ పదసేవ చేయ నా కరములు ఉత్సహించాలి
సదా నిన్ను కీర్తింప
నీతో సఖ్యము చేయ నా మది ఉరకలెయ్యాలి
సదా నీకు దాస్యము చేయ
వందనం చేయ నేనుప్పొంగాలి
సదా సర్వదా ఆత్మ నివేదన చేయ నేను పరితపించాలి
నవవిధ భక్తి మార్గాల నిన్ను చేర
నా మార్గం సులభం చేయవయ్య శివ

మహాదేవా శంభో శరణు...

శివోహం

దీపం జ్యోతి పరం బ్రహ్మ...
దీపం జ్యోతి మహేశ్వర...
దీపేన సాధ్యతే సర్వం...
సంధ్యాదేవి నమోస్తుతే...

శివోహం

బంధాలు అన్నీ అశాశ్వతం అని...

నీ తోడు ఒక్కటే చిరకాలమని పెద్దలు చెప్పింది విని...

బహుదూరమైన గమ్యాన్ని బహుసునాయాశముగా ఎంచుకొని...

నువ్వే దారి చూపించి నిదరి చేర్చుకో

మహాదేవా శంభో శరణు...

Monday, December 7, 2020

శివోహం

అష్టమి తిథి నీకు ఇష్టమని
అష్టకములతోనే పూజిస్తున్నా...

అష్టదళ హృదయ పద్మంతో
ఆర్తి తీరుగా అర్ధించు చున్నాను...

అనుగ్రహించు శంభో...

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...