Tuesday, December 29, 2020

శివోహం

భజన అంటే హనుమ
హనుమ అంటేనే భజన
ఎక్కడ రామ భజన ఉంటుందొ అక్కడ హనుమ తన కళ్ళ నుండి ఆనంద భాష్పాలు స్రవిస్తు ఉండగా నాట్యం చేస్తూ  రెండు చేతులతో తాళం వేస్తూ  తన్మయత్వం తో మైమరచి పోతూ శ్రీరామ నామ గాన ధ్యాన భావ చిత్తంతో రామచంద్రుని దివ్య మంగళ లావణ్య స్వరూప భావంతో లీనమై తన అస్తిత్వాన్ని మరచి పొందే పరమానందం పొందుతాడు...

జై శ్రీరామ్ జై జై హనుమాన్

Monday, December 28, 2020

శివోహం


పద్యములు రచించి పఠించగ పండితుడను కాను...
స్వరములు కూర్చి పాటలు పాడగ గాయకుడను కాను...

నీ గురించిన శాస్త్రమును వేదికపై
వివరింప విశ్వ విఖ్యాత నటన నాకు రాదు...

నాకు తెలిసినది ఒకటే ఆర్తిగా నీ వైపు చూస్తూ
శివ శివా యనుచూ నీ నామ స్మరణ చేస్తూ నా గుండెల్లో నిన్ను నింపుకోవడమే..

శివ నీ పాదముల దగ్గర నా హృదయం వుంచి ప్రార్ధించడమే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! ఈర్ష్యా ద్వేషాలు నాలో ఎదగనీకు
కామ క్రోధాలు నాలో రగలనీకు
మధ మాత్సర్యాలు నాకు సోకనీకు
మహేశా .... శరణు.

శివోహం

ప్రేమికుడంటే పరమేశ్వరుడే...
అమ్మకి తనలో సగానిచ్చి జనానికి ప్రేమతత్వాన్ని బోధించిన ఆది ప్రేమగురువు నా శివుడు...
ప్రేమిస్తే శివుడిలా ప్రేమించాలి...
శివుడిలా ఆ ప్రేమను గెలిపించుకోవాలి...
శివుడిలా ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

అమ్మ

సర్వశక్తి మయి సర్వ మంగళ సద్గతి ప్రదా
సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర స్వరూపిణి

శివోహం

ప్రేమికుడంటే పరమేశ్వరుడే...
అమ్మకి తనలో సగానిచ్చి జనానికి ప్రేమతత్వాన్ని బోధించిన ఆది ప్రేమగురువు నా శివుడు...
ప్రేమిస్తే శివుడిలా ప్రేమించాలి...
శివుడిలా ఆ ప్రేమను గెలిపించుకోవాలి...
శివుడిలా ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం

అమ్మ

అమ్మా..
నేను నీ బిడ్డనే...
నిన్నే శరణంటిని...
కరుణ జూడవే ఓయమ్మ...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...