Friday, January 1, 2021

శివోహం

తండ్రి వలె దయగల మహారాజు...
తండ్రి చిటికెడు విభూది కి కరుణిస్తే...
పిడికెడు అటుకులు బెల్లం నీకు చాలు...

హరిహరపుత్ర అయ్యప్ప శరణు...
మహాదేవా శంభో శరణు...

Thursday, December 31, 2020

శివోహం

ఈ దినమే కాదు...
నా ప్రతి దినం మహాదేవుడి ఆశీర్వాదమే...

ఓం నమః శివాయ

శివోహం

శంభో!!!నువ్వు నేను సగం సగం....
నాలో నువ్వు సగం.....
నీలో నేను సగం....
ప్రాణం నాది అయితే.....
అందులో ఊపిరి నువ్వు....
జీవం నాది అయితే.....
అందులో ఉనికి నువ్వు....
హృదయం నాది అయితే.....
అందులో స్పందన నువ్వు....
ఈ దేహం నాది అయితే....
అందులో ఉన్న ఆత్మ నువ్వు.....
జీవాత్మను నేను అయితే.....
పరమాత్మవు నువ్వు....
బాహ్యంగా నేను.....
అంతర్లీనంగా ఉన్నది నీవే కదా హార...
మహాదేవా శంభో శరణు...

జై శ్రీరామ్

రామా నామమును మించిన అమృతం మరొకటి లేదు...

జై శ్రీరామ్

శివోహం

సమస్య పెద్దదే కానీ...
నీ ఆరాధన నిజమైతే ఆ సమస్య చిన్నదైపోతుంది...

ఓం నమః శివాయ

శివోహం

శివా!చూపులో చురుకుదనం మాటలో మెత్తదనం
భక్తిలో గట్టిదనము కలుగజేయవోయి
మనసున నీ పరిమళం గుభాళించ నీయి
మహేశా.....శరణు.

హారేకృష్ణ

కన్నయ్య వెంట ఉండగా చింతేది చిక్కేదోయి..
మనసు నిండా తాను ఉంటే మనుగడే మధురమోయి...
కష్టమూ తానిచ్చు సుఖమూ తానై వచ్చునోయి...
నువు చేసిన కర్మల ఫలమే నీకు అవసరైన చోట నీకందించునోయి..
అందుకే సదా సద్భావనలు సత్కర్మలు చేయుట అలవర్చుకోవోయి..
ఏదైనా సరే తానేది ఒసగినా ప్రసాదమే అన్న భావన మనసున  నింపుకోవోయి...
అప్పుడంతా ఆనందనిలయమే అంతటా ప్రేమమయమేనోయి...
సంపూర్ణ శరణాగతి ఒక్కటే తనని కట్టిపడేస్తుందోయి...
అది పాటించిన వెదురుముక్క వేణువై 
తన కరముల నిలిచెనోయి..
మురళీ నాదమై గీతాగానమై జ్ఞానసిరులు కురిపించేనోయి..
పరమాత్మను ఎల్లవేళలా గుండెల్లో పెట్టుకో...
నామామృతం  నిరంతరం పానము చేసుకో...
నీలో నాలో అంతటా నిండి యున్నది తానేనని గుర్తుపెట్టుకో..
కష్టాల గోవర్ధనాన్ని అవలీలగా పైకెత్తి...
బాధల వడగళ్లనుండి తను నమ్మినవారి నుండి...
రక్షించు గిరిధారి మనసారా కొలవరే...

హరే క్రిష్ణ హరే రామా
రామా రామా హరే హరే

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...