కన్నయ్య వెంట ఉండగా చింతేది చిక్కేదోయి..
మనసు నిండా తాను ఉంటే మనుగడే మధురమోయి...
కష్టమూ తానిచ్చు సుఖమూ తానై వచ్చునోయి...
నువు చేసిన కర్మల ఫలమే నీకు అవసరైన చోట నీకందించునోయి..
అందుకే సదా సద్భావనలు సత్కర్మలు చేయుట అలవర్చుకోవోయి..
ఏదైనా సరే తానేది ఒసగినా ప్రసాదమే అన్న భావన మనసున నింపుకోవోయి...
అప్పుడంతా ఆనందనిలయమే అంతటా ప్రేమమయమేనోయి...
సంపూర్ణ శరణాగతి ఒక్కటే తనని కట్టిపడేస్తుందోయి...
అది పాటించిన వెదురుముక్క వేణువై
తన కరముల నిలిచెనోయి..
మురళీ నాదమై గీతాగానమై జ్ఞానసిరులు కురిపించేనోయి..
పరమాత్మను ఎల్లవేళలా గుండెల్లో పెట్టుకో...
నామామృతం నిరంతరం పానము చేసుకో...
నీలో నాలో అంతటా నిండి యున్నది తానేనని గుర్తుపెట్టుకో..
కష్టాల గోవర్ధనాన్ని అవలీలగా పైకెత్తి...
బాధల వడగళ్లనుండి తను నమ్మినవారి నుండి...
రక్షించు గిరిధారి మనసారా కొలవరే...
హరే క్రిష్ణ హరే రామా
No comments:
Post a Comment