Friday, January 1, 2021

హరే గోవిందా

ఏమని చెప్పేది, ఎలాచెప్పేది  
ఏ విషయాన్నయినా ఎలా విన్న వించేది
నీవు కలియుగ దైవానివి 
నేను సామాన్య మానవుణ్ణి 
కర్మ బద్ధుణ్ణి, కనికరం అంటే తెలియనివాణ్ణి
దారి తెన్నూ తెలియక నీ చెంత 
చేరుతున్నవాణ్ణి శ్రీ వేంకటేశ్వరా

నీ కృపా కటాక్ష వీక్షణాలను
నాపై ప్రసరించిన నా బుద్ధి మారునేమో 
నా పాపాలు తొలుగునేమో 

నా  అంతరాత్మ ప్రభోధంగా 
నీ చ్చేంత చెరియన్నను, నీవే నాకు దిక్కు 
సర్వ త్వజించి నీకు పూజలు చేయలేను 

కర్మానుసారముగా నడుస్తూ నా మదిలోని 
తలపులను, కష్టాలను తెలుపు కుంతున్నాను  
కనుపాపగా నీవే నా చెంత ఉండి
నా గమ్యం ఏమిటో తెలియపరుస్తున్నావు 

అయినా నీ దర్శన భాగ్యం కోసం 
ఏడుకొండలు ఎక్కి నడిచి వస్తేగాని 
కేశములు అర్పిస్తేగాని
కానుకలు సమర్పిస్తేగాని 
నా మనసుకు తృప్తిగా ఉండదు

అయినా నీ బంటును నేనయ్య 
నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ 
నిత్యమూ నీకు పూజలు చేస్తూ 
నీ చెంతనే మా విన్నపాలు విన్నవించు 
కుంటూ నీ ప్రసాదంతో జీవిస్తూ 
వేడుకుంటున్నాను శ్రీ వేంకటేశ్వరా

Source: whatsapp

శివోహం

నీవే నేను...
నేనే నీవు...
నీకూ నాకూ బేధం లేదు...
నా యోగక్షేమాలు చూసే బాధ్యత నీదే... ఎందుకంటే నాదంటూ నా వద్ద ఏమాత్రం లేకుండా ఊడ్చి వేసి...
నీ పాద పద్మాల ముందు సమర్పించు కున్నాను...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! ఇరుకు గుండెలోన ఇమిడి ఉన్నావు
అంతులేని ఆకాశాన అమరి ఉన్నావు 
అద్భుతాలకే నీవు నెలవై వున్నావు
మహేశా.....శరణు.

శివోహం

నా రక్షణాధారం ,నా జీవనాధారం...
శివుడే నా తోడుగా ఉండగా...
నాకు దిగులుండునా భయముండునా...
ఓం నమః శివాయ

శివోహం

నీవే నేను...
నేనే నీవు...
నీకూ నాకూ బేధం లేదు...
నా యోగక్షేమాలు చూసే బాధ్యత నీదే... ఎందుకంటే నాదంటూ నా వద్ద ఏమాత్రం లేకుండా ఊడ్చి వేసి...
నీ పాద పద్మాల ముందు సమర్పించు కున్నాను...
మహాదేవా శంభో శరణు...

ఓం

గజముఖ నీదయ లేక...
గజమైనను బ్రతుకు నడుప గలమా తండ్రి...
దయచూపు తండ్రి దరి చేర్చు...

ఓం గం గణపతియే నమః

శివోహం

తండ్రి వలె దయగల మహారాజు...
తండ్రి చిటికెడు విభూది కి కరుణిస్తే...
పిడికెడు అటుకులు బెల్లం నీకు చాలు...

హరిహరపుత్ర అయ్యప్ప శరణు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...