Tuesday, January 12, 2021

శివోహం

సిందులేసే గంగమ్మను......శిరాన భెడ్తివి
అడగకుండనే గౌరమ్మకు.......సగం పెయ్యనిస్తివి
వంకరైన సెందురుని.......తలపైన పెడ్తివి
సక్కనైన దేవర......సల్లనైన శంకర

బుసలుకొట్టె పామునేమొ......మెడలోన  చుడ్తివి
రక్తమోడుతున్న చర్మాన్ని.....ఒంటికే కడ్తివి
కాష్ఠంలో బూడిద...........పెయ్యకంత పూస్తివి
సక్కనైన దేవర.............సల్లనైన శంకర

 
బేసి కంటిలోన........నిప్పునె దాస్తివి
చక్కని గొంతులోన......విషమునె పెడ్తివి
కాటికేమొ దొరవై........కాపురమె పెడ్తివి
సక్కనైన దేవర.........సల్లనైన శంకర్

శంకరా ఆని పిల్వంగనె..........సంకనెత్తుకుంటివి
కావరా అని అర్వంగనె...........కంటిలోన దాస్తివి
మనసునిండ తల్వంగనె........మనసులోన పెడ్తివి
సక్కనైన దేవర..........సల్లనైన శంకర   

భోగి శుభాకాంక్షలు

ఉత్తరాయణ పుణ్యకాలాన్ని
తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె
నిలువెచ్చని రవికిరణం..
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు పెద్దలకు ,గురువులకు ఈ భోగి భోగభాగ్యాలతోపాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబసభ్యులకు భోగి శుభాకాంక్షలు....

శివోహం

నీ తోడే మాకు నీడ
నీ నీడనే మా నడక
నీకు మాకు నడుమ
మరెవరికీ చోటులేదు శివ
మాకోసం కైలాసం వదలి
మాతోడుగ ఉన్న నీవే మా దేవుడవు...

మహాదేవా శంభో శరణు

శివోహం

చంద్రబింబానన చంద్రరేఖామౌళి
నీలకుంతలభార నీలగళుడు
ధవళాయతేక్షణ ధవళాఖిలాంగుండు
మదన సంజీవనీ మదనహరుడు
నాగేంద్ర నిభయాన నాగకుండలధారి
భువన మోహన గాత్రి భువనకర్త
గిరిరాజకన్యక గిరిరాజనిలయుండు
సర్వాంగ సుందరి సర్వగురుడు
గౌరి శ్రీవిశ్వనాథుండు కనకరత్న
పాదుకల మెట్టి చట్టలు పట్టి కొనుచు
నేగుదెంచిరి యొయ్యార మెసకమెసగ
విహరణ క్రీడ మాయున్నవేది కపుడు

శ్రీనాథుడు భీమఖండం కూర్చిన చక్కటి పద్యం....

Monday, January 11, 2021

శివోహం

శంభో! నా మనసులోనే ఉండిపో...

ఉపిరి ఊయలలో ఊగుతున్న నీ బిడ్డను
నీవే రక్షించాలి కదా తల్లీ తండ్రి నీవే ఐ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

వేలుపులకు వేలుపువు నీకే తోలి పూజ కదా
ఇక్కట్లను తొలిగించే ఆది దైవము నీవే కదా
మా కన్నీళ్లను తుడవకుంటె నీకు న్యాయమా తండ్రి...

ఓం శివోహం... సర్వం శివమయం

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ గణపతయే నమః

శివోహం

శంభో!!!నిద్ర లేచింది మొదలు...
ప్రతి నిత్యం నీ నామం వేల సార్లు పలుకుతున్న...
నా పేరు ఒక్కసారి పలికి రారా నాన్న అని పిలిస్తే...
పరుగెత్తు కుంటు రానా...

మహాదేవా శంభో శరణు....

గోవిందా

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u గోవిందా… నీవు పరమాత్మవని నీ చెంతకు రాలేదు… నీవు లక్ష్మీ నాథుడవని సకలైశ్వర్య సంపన్నుడవన...