Monday, January 25, 2021

శివోహం

విఘ్నములను తొలగించే విఘ్నగణపతి....
సాధనములకు ఫలములిచ్చే సిద్ధి గణపతి...
విశ్వానికి నీవే ఆది గణపతి....
జగతికి నీవే మహా గణపతి...
లోకానికి నీవే వేదం...
సృష్టికి నీవే జ్ఞానం...

ఓం గం గణపతియే నమః

శివోహం

చంద్రకళాధర...
చంద్రమౌలీశ్వర...
జటాజూటధర...
జగదీశ్వరా శరణు...

Sunday, January 24, 2021

శివోహం

నీవు అనంతు డవు...
అఖండ తేజో నిధివి...
నిన్ను తెలియలేను...
నన్ను తెలుసుకొలేను...
సూత్రధారిగా ఉంటూ...
నీవాడించే జగన్నాటకం లో
ఒక పాత్రధారినీ మాత్రమే నేను...
వట్టి తోలుబొమ్మను...
నీవు లేకుండా నేను లేను...
ఆశలు నాలో పుట్టించి..
తప్పులు చేయ అజ్ఞాపించకు...
నన్ను నీ నుండి దూరం చేయకు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఓ నీరు తీయగా...
మరోటి ఉప్పగా...
రెండుకలిపి నా గుండె మరలో కలిసిపోయి...
నానోట పలికే నమః శివాయ నామంతో శుద్ధి అయి... నీశిరమున పడి పానవట్టమునకు చేరుసరికి అమృతమే అగును కదా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

అయ్యప్ప

అయ్యప్ప ప్రసాదం అమృతమే.. 

అమ్మ

అమ్మా జగన్మాత...
నా మదిలో...
నా హృదిలో...
నా ఎదలో...
నా కలలో...
నా ఇలలో...
నా అంతరములో...
అణువణువునా నిండి ముర్తీభవిస్థున్నావు...
అమ్మ మాయమ్మ శరణు....

Saturday, January 23, 2021

జై శ్రీరామ్

ధర్మబద్ధమైన కోరిక అశాంతిని కలిగించదు.
కోపాన్ని పుట్టించదు.
మనసును శుద్ధి చేసుకోవాలంటే మొదటగా భగవంతుడు ప్రసాదించిన దానిని స్వీకరించాలనే భావం మనిషిలో కలగాలి.
ఈ భావం వలన కోరిక అనేది నశించిపోతుంది.
అపారమైన ప్రేమను భగవత్పరంగాను, భగవంతుని ప్రతిరూపమైన తోటి జీవుల పరంగాను పెంపొందించుకుంటే కోపం అనే మలినం తొలగిపోతుంది.
త్యాగగుణాన్ని అలవరచుకుంటే లోభగుణానికి చోటుండదు.
భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంచుకొనుటచేత మోహం కూడా దూరమైపోతుంది.
ఈ ప్రపంచ సౌఖ్యాలన్నీ అనిత్యమనే వివేకం చేత మదము, మత్సరము రెండు మలినాలు కడుక్కుపోతాయి.

ఈ విధంగామనసుపై నుండు మలినములను శుద్ధి చేసుకోకుండా బాహ్య శుద్ధి ఎంత చేసినా భగవత్ప్రేమకు నోచుకోలేరు.

సర్వే జనా సుఖినో భవంతు.
ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...