Monday, February 8, 2021

శివోహం

ఎన్నో కష్టాలు...
ఎన్నో కన్నీళ్లు...
మరెన్నో రాతలు నీవు పెట్టే ఈ జీవిత పరిక్షలో గెలిపించినా...
ఓడించినా చింతించను...
నిన్ను కోరేది ఒక్కటే..
వాటిని తట్టుకునే శక్తిని మనో ధైర్యాన్ని ప్రసాదించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, February 7, 2021

శివోహం

శివుడిని అంగీకరిస్తే జీవితాన్ని అంగీకరించినట్లే.

మనం శివా అన్నప్పుడు మీరు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి మానవుడు అనుభూతి చెందేవన్ని
అనుభూతి చెందాడు. ఆయన ఒకే సమయంలో ఎన్నో గుణాలని కలిగిన వాడు.

ఆయన అతి సుందరుడు ఆయన వికృత రూపుడు
ఆయన గొప్ప తపస్వి అలాగే సంసారి కూడా.ఆయన
ఎంతో నిష్టా గరిస్టుడు అద్భుతమైన తాండవం చేయ
గలడు. అచంచల నిశ్చ లత్వం కలిగిన వాడు.

దేవుళ్ళు ఆయనని పూజిస్తారు రాక్షసులు అరాది
స్తారు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు ఆయనని ఆరాధిస్తాయి. మనం శివుడు గురించి ఏమి చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే. ఈ ప్రపంచానికి విరుద్ధమైనది కూడా ఆయనదే.

ఆయన భైరవుడు ఎంతో కోపం కలిగి ఉన్నవాడు
రౌద్ర స్వరూపుడు హింసాత్మక స్వభావం ఆయన
ఎంతో కరుణామూర్తి కూడా. ఆయనే సుందర మూర్తి.

ఆయన సమ్మోహితుల్ని చేస్తారు. మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు. ఎంతో దయ కలిగిన అందగాడు.
ఆయన నాట్యం సృష్టి స్థితి గతులను లయం చేస్తుంది

సంపూర్ణం నిశ్చలుడు అదే సమయంలో ఏ కదలికా లేనివాడు. శివుడు ఒక యోగి వైరాగి. ఆయనకు పేరు
పెట్టలేం. ఆయనకు ఒక నామం ఇస్తే ఆ నామం పరిమితం చేసినట్టే. అదే సమయంలో ఆయనకు ఉన్న అనేక అనేక నామాలను ఒక్కటిగా చేరిస్తే అదే అనేక బ్రహ్మాండములను ఒక్కటిగా చేస్తుంది.

అందులో ఉన్న సంక్లిష్టతలు మనకు అంతుచిక్కని విషయాలకు ప్రతినిధి ఆయనే. శివు డి ని మీరు అంగీకరించే కలిగితే దాని అర్థం ఇంత సంక్లిష్టమైన వాడు. మీరు ఆలోచించే ప్రతి గుణానికి ఒక రూపం.

శివుడిని మీరు అంగీకరిస్తే మీ జీవితాన్ని మీరు దాటినట్లే. దీని అసలు ఉద్దేశం ఏమిటంటే. మీ తర్కాన్ని వినాశనం చెయ్యడమే. అప్పుడు మీరు
మీ జీవితంలోని కొత్త విషయాలను తెలుసుకుంటారు

శివోహం

నియమాలు భక్తిని నియంత్రిస్తాయి నిజమే తండ్రి...
మహాదేవా కానీ నాకు మినహాయింపు ఇవ్వాలి...
నాకు నీ నామస్మరణ తప్ప నాకేమి తెలియదు...

మహాదేవా శంభో శరణు...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

సకల శుభములను....
సుఖ సంతోషములను...
ప్రసాదించువాడు నీవే తండ్రి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

సకల శుభములను....
సుఖ సంతోషములను...
ప్రసాదించువాడు నీవే తండ్రి....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా నామము.....
శివా భక్తి.....
నాకు ఉన్నట్టి సిరిసంపదలు..... 

శివోహం.... సర్వం శివమయం.....

గోవిందా

ఇంకేం కోరిక కొరకు తండ్రి...
ఈ మాత్రం చాలదా...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...