Thursday, March 4, 2021

శివోహం

ముక్తి మార్గమునకు మొదటి దైవము...
సిద్ధి బుద్ధి వర ఫలము నొసగిన తొలి పూజ్యుడు...

ఓం గం గణపతియే నమః

Wednesday, March 3, 2021

శివోహం

శివ నామమే నా శ్రీరామ రక్ష...
శివ క్షేత్రమే నా ఆనంద నిలయం...
శివుడే నా అత్మ బందూవు...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివ!!!
మా పాపములన్నీ పటపంచలయ్యేలా...
నీ చల్లని చూపులు సోకితే చాలు...
మా కష్ట నష్టాలను దూరం చేసేలా
నీ కరుణ కటాక్షాలు కలిగితే చాలు...
మహాదేవా శంభో శరణు....

Tuesday, March 2, 2021

స్వామి శరణం

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది..
నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థం అవుతుంది..
యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది..
సంగీతానికి భక్తి కలిస్తే కీర్తన అవుతుంది..
గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది.
భక్తి ప్రవేశిస్తే మనిషి మనిషిగా అవుతాడు...

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

నిజంగా నేను ముర్కుడినే....
నువ్వు త్రినేత్రదారుడవని సంగతే మరిచను...
ముక్కంటితో ముల్లోకాలను పాలించే దేవదేవుడవు అనే సంగతి మరిచితిని...
నా రెండు కళ్ళు మూసుకొని ఎవరు చూస్తాలేరని చేయారాని తప్పులు చేస్తు పైగా శివజ్ఞ అని చెప్పుకుంటున్న ...
శివ నా అహం ను తొలిగించి నన్ను నీ వాడిగా చేసుకో...

మహాదేవా శంభో శరణు...

Monday, March 1, 2021

శివోహం

ఉండలేను నిన్ను విడిచి..
ఉండలేను నిన్ను మరచి...
నీతో నేను...
నాతో నువ్వు....
నీలో నేను...
నాలో నువ్వు...
పంచ భూతాల సాక్షిగా నువ్వే నేను నేనే నువ్వు....

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో!!!
బతుకు పోరులో నేను దారి(ధర్మం)తప్పలేదు... 
భక్తి బాటలో నీ దారి(శివసేవ)మరువ లేదు... 
నీ కింకరున్ని తండ్రి దయచూపు... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...