Friday, March 12, 2021

శివోహం

శంభో!!! పూర్వకృత కర్మఫలం అనుభవింపక తప్పదా శివ  ఎంతటివారికైనా...

అయితే

అలా కర్మఫలం ముగిసిన నాడు నీ సన్నిధికే చేరువయ్యేలా నన్ను అనుగ్రహించు ప్రభూ...

మహాదేవా శంభో శరణు...

Thursday, March 11, 2021

శివోహం

శివపార్వతుల కళ్యాణం...
నిత్యా కల్యాణం...
అదే లోక కల్యాణం...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

శివపార్వతుల తత్వం....
రేయిపగలుకు నిదర్శనం...
చూడముచ్చటైన అర్ధనారీశ్వరుల సాక్షాత్కారం....
మదిలో నిలిచెను కైలాస శిఖరం...
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఉన్నవారు శివాలయము కట్టగలరు...
గుడికి వెళ్లి ప్రత్యేక దర్శనం లో అభిషేకం చేయగలరు....
నేనేమి చేయగలను శివ కడు బీదవాడినయ్యా...
పని చేస్తే కానీ పుట గడవని కటిక దరిద్రుడిని...
నమక చమకం తెలియదు...
అష్టోత్తరాలు అస్సలే రాదు...
ఏమో నయ్య శివ గుండె నిండా నీవే ఉన్నావు...
ఏమివ్వగలనయ్య శివ నీకు...
నా శరీరమే నీకు దేవాలయం...
నా శిరస్సు నీకు శిఖరం...
నా హృదయం నీకు పీఠం...
నా కంటి చూపు నీకు దీపాలు...
నేను తినే గొడ్డుకారం అన్నమే నీకు పంచబక్ష పరమాన్న నైవేద్యం...
నా కంటి నుండి వచ్చే రూధిరమే నీకు గంగజాలం...
వినవయ్యా సాంబశివ నా మొర వినవయ్యా....
నీ స్థావరానిని నన్ను చేర్చుకోవయ్య లోకేశ్వరా...

మహాదేవా శంభో శరణు...
(దయచేసి ఈ పోస్ట్ ను ఎవరు కాపీ చేసుకోకూడదు)

Tuesday, March 9, 2021

హరిహారపుత్ర అయ్యప్ప

అలసటోతో వచ్చిన కన్నీళ్లు కావవి...
తల్లి తండ్రి గురువు దైవం అన్ని తానై...
నన్ను ముందుకు నడిపిస్తున్న హరిహర తనయుడిని చూసిన ఆనందం తో ఉప్పొంగి వస్తున్న కన్నీళ్లు...
నా నెయ్యబిషేకం తో పాటు నా రుదిరంతో కూడా అభిషేకించుకో తండ్రి...

హరిహర పుత్ర అయ్యప్ప శరణు...
మహాదేవా శంభో శరణు....

శివోహం

సృష్టి, స్థితి, మరియు లయము లలో నీవే పరమ సత్యము...

సత్యమునకు మూలము మరియు అంతము నీవే...

నీవే సమస్త సత్యమునకు సారము...

నీవే సర్వం నీవే సకలం

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

అన్నీ తెలుసని మనిషి...
తనని తాను తెలుసుకోలేక మాయలో పడతాడు....
ఈరోజు నాది అనుకున్నది...
రేపు ఇంకొకరిది...
అంతా మాయా ఎప్పుడు తెలుసుకుండాడు...
మహాదేవుడి పాదాలు పట్టుకుంటే నే కదా...
మాయనుండి బయటపడేది....

ఓం శివోహం... సర్వం శివమయం
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...