ఆధ్యాత్మిక చింతన...
మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజం. అలా అని ఎల్లవేళలా అసంతృప్తిగా జీవించలేం కదా. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. భగవధ్యానం వలన అశాంతి దూరమవుతుంది. ప్రశాంతత వరిస్తుంది. తద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. మనోవ్యాధులు దరిచేరవు.
జీవితంలోని కొన్ని పరిస్థితుల వలన చికాకులు కలగడం సహజం. చీకాకులు కలిగినప్పుడు సరైన నిర్ణయాలను తీసుకోలేం కదా. భగవధ్యానం చేసే వారిలో ఈ సమస్య కనిపించదు. వారికి ఆలోచనలలో స్పష్టత ఏర్పడుతుంది. మానసిక చికాకులు తగ్గుతాయి.
నిరాశ, నిస్పృహ వంటివి దరిచేరవు. ఆధ్యాత్మిక చింతన అనేది శ్రీరామరక్షగా వ్యవహరిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ రాబోయే కాలం అంతా మంచే జరుగుతుందన్న ఆశావాద దృక్పథం అలవడుతుంది. దాంతో, చేసే పనిపై శ్రద్ధ మరింత పెరుగుతుంది.
ఆధ్యాత్మిక చింతన కలిగే మరొక ముఖ్యమైన ప్రయోజనమిది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యమైన మనసు అనారోగ్యం పాలయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా, మానసిక అశాంతితో, చికాకులతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కవుగా. ఆధ్యాత్మిక చింతనని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకునే వారిలో అనారోగ్య సమస్యల బారిన ప్రమాదాలు తక్కువని తెలుస్తోంది. ఎందుకంటే, వారు మానసికంగా దృఢంగా ఉంటారు. కృంగుబాటుకు గురవడం తక్కువ.
దైవచింతనను ప్రాముఖ్యాన్ని తెలుసుకున్నవారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దైవం తమ వెంట ఉందన్న నమ్మకంతో తాము అంకితభావంతో తమ పనిని తాము పూర్తిచేస్తారు. ఫలితం గురించి ఆలోచించకుండా పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఏది జరిగినా మన మంచికే అన్న ఆలోచనా ధోరణితో ముందుకు వెళతారు. గెలుపోటములు వారి గమ్యానికి ఆటంకాన్ని ఏర్పరచలేవు. స్థితప్రజ్ఞతకు అలవరచుకుంటారు. గెలుపును అలాగే ఓటమిని సమానంగా స్వీకరించడం నేర్చుకుంటారు.
ఆధ్యాత్మిక చింతన వలన ఏకాగ్రత పెరుగుతుంది. దాంతో, పనిపై అపారమైన శ్రద్ధను కనబరచగలుగుతారు. దాంతో, మంచి ఫలితాలు లభించే ఆస్కారం ఉంది. విశ్లేషణా పరిజ్ఞానం పెరుగుతుంది. దాంతో, పరిస్థితులను అలాగే మనుషులను చక్కగా విశ్లేషించగలుగుతారు. తగిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలనైనా అవలీలగా పరిష్కరించగలిగే నేర్పు సొంతమవుతుంది.
ఆధ్యాత్మిక చింతన వలన కలిగే అనేక లాభాలలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి, పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనకు కలిగిన ప్రాముఖ్యాన్ని వివరించాలి. తద్వారా, వారు వినయ విధేయతలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు. తమ తమ రంగాలలో రాణిస్తారు. సమాజానికి తమవంతు సేవను చేయగలుగుతారు. ఈ మధ్య కాలంలో యువత ఆధ్యాత్మికత దిశగా ఆలోచనలు చేయడం అభినందించదగిన మార్పే.