Tuesday, March 23, 2021

ఓం గం గణపతియే నమః

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం

ఓం గం గణపతియే నమః

శివోహం

మొదటి ఒడి చేసుకున్న ఋణం...
రెండవ ఒడి తీర్చుకున్న ఋణం...

రెండు ఋణాల జమాఖర్చుల మధ్య నను నడిపే నాధుడు నా శివుడు...

ఓం శివోహం... సర్వం శివమయం

Monday, March 22, 2021

శివోహం

కారణములు లేక కార్యాలు జరుగవు.
భగవంతుడు ఏది చేసినా అందులో మంచే తప్ప చెడు ఏమీ ఉండదు. రైతు పంట చేనుకు మందు జల్లేటపుడు చీడ పురుగులు చస్తాయే తప్ప పంట మెుక్కలకు ఏమీ కాదు. భగవంతుని వాక్యములు పెడచెవిన పెట్టి గర్వోన్మత్తులై దయ దాక్షిణ్యాలు లేక హింసకు పాల్పడే చీడ పురుగులన్నీ రాలిపోవాలనే ఈ వినాశనం. భగవంతుని యందు భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నవారు భయపడవలసిన పని లేదు. భగవంతుని నామ స్మరణ చేసుకొండి. వ్యక్తి ప్రయత్నముగా పరిశుభ్రత పాఠించండి. మానవుడు చేసుకున్న మహా తప్పిదమే ఈ వినాశనం తప్ప దీనికి భగవంతుని బాధ్యుతుని చేయడం వెర్రితనం. కనీసం ఈ వినాశనం చూసైనా మనుషులలో మార్పు రావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. జీవులను హింసించడం మానుకోవాలి. లేదంటే ఇంతకంటే పెద్ద వినాశనం తప్పదు.

Sunday, March 21, 2021

శివోహం

శివ, సదాశివ, ప్రాణనాధ
నిను అర్థం చేసుకునే దారి వెదకడం అంటే...
నన్ను నేను తెలుసుకోవడం...
ఆరెండు అర్థం అయ్యే స్థితిలో నను
చేర్చుకో పరమేశ్వరా...
నామనమున నీవు నిలిచిపో...
ఓం నమః శివాయ

Saturday, March 20, 2021

శివోహం

ఓం గణేశాయ నమః

వినాయకుడి ఆరాధనతొనే లక్ష్మీ దేవి నిలిచి ఉంటుంది.లక్ష్మీ దేవికి చంచల అని పేరు."ఓం చంచలాయై నమః".అంటే ఒకే చోట ఎక్కువసేపు ఉండనిది.లక్ష్మీ దేవి ఎప్పుడు స్థిరంగా ఉండదు.మరి గణపతో?గణపతి ఒకసారి సాధారణంగా ఎక్కడైనా కూర్చుంటే కదలడు.ఆయన స్థిరంగా కూర్చుంటాడు.

లక్ష్మీ దేవిని,గణపతిని కలిపి ఆరాధించాలి.కలిపి ఆరాధించేవారి ఇంటి నుంది లక్ష్మి దేవి తాను వెళ్ళిపోతాను అంటే వినాయకుడు కాసేపు కూర్చొవమ్మా అంటూ ఆమేను ఆ ప్రదేశంలో స్థిరంగా ఉంచుతాడట.అందువల్ల కేవలం లక్ష్మి దేవినే కాదు,ఆమేతో పాటు వినాయకుడిని ఆరాధించాలి.

వ్యాపార కేంద్రాల్లోను,ఇంట్లోను లక్ష్మి దేవి ఫొటో ప్రక్కన వినాయకుడి ఫొటొ ఉంచి రోజు ముందు స్వామిని పూజించాక లక్ష్మిదేవిని పూజించండి.ధనం నిలుస్తుంది.

ఓం గణేశాయ నమః

శివోహం

ఆధ్యాత్మిక చింతన
శ్రీరాముని కరుణ


సకల గుణాభిరాముడు, రామా, శ్రీరామ అనగానే భాధలన్ని ఈడేరు తాయి. నేటికి రామాలయం లేని ఊరు అరుదు. శ్రీరాముడే మనకు ఆదర్శం. ఆయన జీవితం మనకు సందేశం అనేది ప్రతి ఒక్కరూ గమనించవలసింది. శ్రీరాముడు అరణ్యవాస సమయంలో ఎందరినో కరుణించి పుణ్య లోక ప్రాప్తి కలిగించాడు. అహల్యకు శపవిమోచన కలింగించాడు.

 
శబరికి సైతం స్వర్గలోక ప్రాప్తి కలిగించాడు. అందుకు నిదర్శనం సీతాన్వేషన చేస్తున్నప్పుడు జటాయువును చూడటం రెక్కలు విరిగి ధీన స్థితిలో, కోన ఊపిరితో ఉండటం జరిగింది. ఆ స్థితిలో జటాయు వును చూడగానే పరిస్థితి అర్థ మైంది. శ్రీరాములవారికి, సీతా దేవిని రావణుని చెర నుండి కాపాడటానికి రావణుడితో జటా యువు పోరాడి చేసిన త్యాగం మెచ్చుకుని దుర్కిస్తాడు. శ్రీరాము ని చూడగానే కళ్లు తేలేసింది జటాయువు. రాముడు ఆ పక్షికి దహన సంస్కారాలు చేసి, నా అనుజ్ఞతతో ఉత్తమలోకాలకు వెళ్లమని ఆదేశించాడు.

ఆ విధంగా శ్రీరాముని కరుణ వలన జటాయువుకు పుణ్య లోకం ప్రాప్తించింది. జంతువులలో చాలా అల్పమైన ప్రాణి ఉడుత కూడా వంతెన కట్టే సయంలో తన వంతు బాధ్యతగా సహాయపడిందని అంటారు. లంకా నగరానికి సముద్రం మీద వారధి నిర్మిస్తున్నప్పుడు వానరులు రాళ్లు, రప్పలు తెచ్చి వారిధి నిర్మాణానికి పూనుకున్నారు.

ఎవరికి చేతనైన సహాయం వారు చేస్తున్నారు. ఆ వానరులలో చిన్న, చిన్న వానర ములు కూడా తమ చేతనైన సహాయం చేస్తున్నారు. అప్పుడొక ఉడుత ఇదంతా గమనించి నా వంతు సమాయం చేయాలనే తీర్మానించుకుంద. చిన్న వానరులు చేస్తున్న పని తదేకంగా గమనించి, తన అల్పత్వాన్ని లెక్క చేయకతాను ఇసుకలో దొర్లి తన వంటికి అంటుకుని ఉన్న ఇసుక రేణువులను వారధి కట్టే చోట దులుపుతూ సముద్రంలో వేసింది.

అది పదే పదే అటు ఇటు తిరుగుతూ తన చేతనైన సహాయం చేసింది. ఉడుత చేస్తున్న ఆ పనిని పరిశీలనగా చూసిన శ్రీరాముని మనసు ద్రవించి ఉడుతను చేతిలోకి తీసుకుని దాని వీపుపై ప్రేమగా నిమిరాడని దానికి గుర్తుగా ఉడుత వీపు పై మూడు చారలు నేటికి ఉన్నాయి.

ఆ ఉడుత జాతికి శ్రీరాముని కరుణ కటాక్షం వలన ఉన్నత లోక ప్రాప్తమైంది. రామాయణం ఈ జగతుత ఉన్నంత వరకు, శ్రీరాముని కథను జనులు చదివినంత వరకు మనం వానరులను గుర్తుకు చేసికొనకుండా ఉండలేం. అనామకంగా అడవులలో సంచరించే వానరాలకు శ్రీరా ుని కరుణ కటాక్షం వలన ఈ అదృష్టం కలిగింది. రామ, రావణ యుద్ధంలో మరణించిన వారందరూ సజీవులై శ్రీరాముని కరుణా కటాక్షం వలన జీవించారు.

ఓ జటాయువు, ఓ ఉడుత అని చేసిన త్యాగాలకు పుణ్య లోకం ప్రాప్తించి ఉంటే అన్ని తెలిపిన మానవులకు ఆ శ్రీరాముని నామోచ్చారణతో లోక ప్రాప్తి కలుగు తుందని అవసానదశలోనే కాకుండా ప్రతి నిత్యం శ్రీరామ! జయ రామ! జయ జయ రామ అనే రామ నామం వలన ఆ శ్రీ రాముని కరుణా కటాక్షమునకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలని అశిద్దాం.

వార్త పత్రిక నుండి సేకరణ

శివోహం

నా ఊపిరి
చూపు
ప్రాణం
పయనం అన్నీ నీవే శివ...
చివరాఖరి నా చూపు కూడా నీ వైపే...

మహాదేవా శంభో శరణు.. 
ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...