Wednesday, March 31, 2021

శివోహం

పరిపూర్ణ మైన భక్తితో 
నిరతము కొలిస్తే
నిండు మనసుతో కరుణిస్తాడు బొజ్జ గణపతయ్య

ఓం శివోహం.... సర్వం శివమయం....
ఓం గం గణపతియే నమః

శివోహం

సమస్తచరాచర సృష్టిని శాసించు కర్తవు నీవు....

చావుపుట్టులకలో వలయ చక్రంలో తిరిగే జీవుడను నేను....

సర్వజన పాపకర్మలను మన్నించు దేవదేవుడవు నీవు....

కర్మలు చేస్తూ పుట్టెడు దుఃఖాన్ని అనుభవించే పాపపు జీవుడను నేను...

చావుపుట్టుక చక్రం లో తిరిగి తిరిగి అలసిపోయాను...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మురికి కొంపగ పేరు పొందిన నా దేహం....
నిన్ను పూజించడం ద్వారా...
నిత్యం నీ నామ స్మరణా చేయడం వల్లే వెలిగిపోతోంది తండ్రి..

మహాదేవా శంభో శరణు...

Tuesday, March 30, 2021

శివోహం

కన్నుతెరిస్తే  వెలుగు...
కన్ను మూస్తే చీకటి...
నోరుతెరిస్తే శబ్దము...
నోరు మూస్తే నిశ్శబ్దము...
ఏ క్షణమో తెలియదు జీవిత అంతం...
చితి కాలుతుంటే వెనుదిరిగి వచ్చే బంధువులని చూసి గ్రహించా మరణంలో తోడు ఎవరు రారు అని..
అందుకే అంతిమ యాత్ర దగ్గరుండి పూర్తిచేసే
పరమేశ్వరుడి పాదము ఈ క్షణమే పట్టుకోని వేడుకోవే మనసా...

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

పశ్చాత్తాప, ప్రాయశ్చిత్తాలు!
కృత్వా పాపం హి సంతప్య / తస్మాత్పాపాత్‌ ప్రముచ్యతే
నైవ కుర్యాత్‌ పునరితి / నివృత్త్యా పూయతే తు సః
-మనుస్మృతి (11-231)
‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు’. మతిమరపువల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.
మది మఱపున బాపము దన
కొదవుటయును బిదప వగచి యొక సగమును నే
నిది సేయనింక ననియెడు
మదిఁ బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్‌.
-మహాభారతం (ఆరణ్యపర్వం:5-41)
‘తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది’. ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. ‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకొని బాధ పడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెపుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తమని’ అంటారు. ప్రతి మనిషీ మనసా వాచా కర్మణా ఎప్పడూ ఏ తప్పులనూ చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే, ఆ పాపం తొలగిపోతుంది. ‘కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి. దానినే ‘మనఃప్రాయశ్చిత్త’మని అంటారు.
పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్‌
ఆచార్యస్యచ సర్వదా
తేషుహి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే.
-మహాభారతం (శాంతిపర్వం: 1-311)
‘తల్లి, తండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది’. తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయ కూడని చెట్టును నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే. ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి. దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు. గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే. ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.

డాక్టర్‌ శాస్ర్తుల రఘుపతి

శివోహం

సనాతన ధర్మమే సమున్నతం!

భారతీయ సనాతన ధర్మం భగవంతుణ్ణి సర్వరూపాలలో దర్శిస్తున్నది. మానవునికి అన్ని జీవులపట్లా భక్తిశ్రద్ధలను బోధిస్తూ ఈ భూమండలంపై తన పాత్రను, బాధ్యతను ఉపదేశిస్తున్నది. దీనిని అర్థం చేసుకున్నవారు సకల జీవావళికి ఉపయోగపడే ధార్మికులుగా జీవిస్తూ, తమ జీవితాలే మనకు సందేశాలుగా మలచి మన స్మృతిపథాలలో మిగిలిపోయారు. అర్థం చేసుకోలేనివారు ఇంకెందరో వున్నారు. సనాతన ధర్మం మత్స్యాన్ని, కూర్మాన్ని, వరాహాన్ని, నరసింహున్ని దశావతారాల్లో చేర్చింది. అలాగే, శునకాన్ని భైరవుడిగా పేర్కొన్నది. సర్పాన్ని నాగదేవుడని కొలుస్తూ పండుగలను కూడా జరుపుకొంటున్నాం. సనాతన ధర్మంలో చీమలు మొదలుకొని ఏనుగుల వరకు అన్ని జీవాలకూ అత్యంత ప్రాధాన్యమిచ్చి భక్తిప్రపత్తులను చూపమని బోధిస్తుంది. అలాగే, వృక్షజాతులలో అనేక వృక్షాలను, మొక్కలను భక్తి ప్రపంచంలో భాగం చేసింది. చివరకు నిర్జీవాలైన రాళ్ళూరప్పలూ దైవానికి ప్రతీకలే. వేదాలలో తొలిమంత్రమే ‘అగ్ని’దేవుని ప్రార్థనా శ్లోకం. ఈ క్రమంలోనే వరుణున్ని, వాయువును, అష్టదిక్పాలకులనూ పూజిస్తున్నాం.

సర్వాంతర్యామిని సనాతన ధర్మం సాహిత్యరూపాలలో అనేక విధాలుగా వివరించింది. భగవంతుణ్ణి అంతటా, అన్నిటా చూడటమే అనుష్ఠానం. అదే సమున్నత ధర్మం! నిజానికి హేతువాదంపైనే ఉపనిషత్తుల జ్ఞానం ఆధారపడి ఉంది. సృష్టి రహస్యాన్ని ఛేదించిన జ్ఞానమే ఉపనిషత్తుల సారం. ఈ విశ్వమంతా ఒకటే వ్యవస్థ అన్న దానిని ఆధారాలతో సహా ఉపనిషత్తులు నిరూపించాయి. వేల ఏండ్ల కిందటే ఋషులు ‘పూర్ణమదః పూర్ణమిదం’ అని, ‘విశ్వాన్ని ఒక సంపూర్ణ వ్యవస్థ’గా ప్రకటించారు. ఆధునిక శాస్త్రవేత్తలుకూడా ఈ విశ్వాన్ని ఒక బ్రహ్మాండ వ్యవస్థగానే గుర్తించారు. విశ్వం పట్ల సర్వదా కృతజ్ఞతలు ప్రదర్శించడం సనాతన ధర్మంలోని అసలైన మౌలికత. ఈ కృతజ్ఞతాభావం నుండే ప్రతి జీవిని, నిర్జీవిని ప్రార్థించడం ప్రారంభమైంది. సర్వాంతర్యామిని సర్వేసర్వత్రా చూడటమే సనాతన ధార్మికతలోని ఉత్కృష్టమైన ఆధ్యాత్మికత. ఈ సువిశాల దృష్టిలోనే అత్యున్నత జ్ఞానం ఇమిడి ఉంది. దానినే ఆధునిక పాశ్చాత్య తత్తవేత్తలు ‘పాంథీయిజం’ అన్నారు. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ నమ్మిన తత్త్వమూ ఇదే.

‘యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపష్యతి’, ‘యస్మిన్‌ సర్వాణి భూతాని ఆత్మైవా’ అంటూ, ఆత్మజ్ఞాని అన్ని భూతాలలో భగవంతుణ్ణి సందర్శిస్తాడని ‘ఈశావాస్యం’ చెప్పింది. ‘ముండకోపనిషత్తు’కూడా ‘బ్రహ్మ వేదం విశ్వమిదం వరిష్ఠం’, ‘విశ్వమే బ్రహ్మం’ అన్నది. ఉపనిషత్తులను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు కాబట్టి, వ్యాసుడు ‘భగవద్గీత’లో శ్రీకృష్ణునిచే అనేక రీతుల్లో వివరింపజేశాడు. ఆత్మజ్ఞాని అయిన శ్రీకృష్ణుడు ‘అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత’ అన్ని భూతాలలో స్థిరమై ఉన్నవాడినని చెబుతూ, తానే వృక్షాలలో రావిచెట్టునని, గుర్రాలలో ఉచ్చైశ్రవాన్నని, ఏనుగులలో ఐరావతాన్నని, ఆవులలో కామధేనువునని, సర్పాలలో వాసుకినని, నాగులలో అనంతుడనని, ఆయుధాలలో వజ్రాన్ని అని, పరిశుద్ధ పరిచేవాటిలో గాలిని అని, చేపలలో మొసలిని అని, నదులలో జాహ్నవిని అని, పనిముట్లలో తానే దండాన్ని అని పలు విధాలుగా ఆత్మతత్త్వాన్ని విశదీకరించాడు.

ఈ విధంగా పేర్కొనడంలో ఆత్మజ్ఞాని అయిన శ్రీకృష్ణుని వేరుగా చూపడమే వ్యాసుని లక్ష్యం. ఈ మౌలికత సనాతన ధర్మంలో సమ్మిళితమైనందుకే అన్ని జీవులపట్లా ఒకే భావన కనపడుతుంది. అందువల్లే ప్రతి జీవి, వృక్షం, రాయి పట్లా ఆరాధనా భావం వెల్లివిరుస్తున్నది. ప్రతి భారతీయుడు ప్రతిచోటా భగవంతుని చూడగలుగుతున్నాడు. అది తులసిమొక్కే కావచ్చు, రావిచెట్టే కావచ్చు, నాగుపామే కావచ్చు, చివరకు రాయిరప్పా ఏదైనా కావచ్చు. ఇంతటి విశాల, విస్తృత దృక్పథం కాబట్టే, మన సనాతనత్వం ఒక మతంగా కాకుండా ధర్మమై విరాజిల్లుతున్నది.

-రావుల నిరంజనాచారి

శివోహం

నాలో ఉన్న అహం,స్వార్థం కాల నాగై...
కాల కూట విషం చిమ్ముతోంది...
మొత్తం దేహమంతా భగ భగలాడుతోంది...
నిత్య దు:ఖంలొ నేనున్నాను...
గరాలకంఠుడవు నీవు...
నాలో ఉన్న అహం,స్వార్థం ను నీకు నివేదన గా సమర్పిస్తాను...
నాలో అహం తోలిగించు నీ దరి చేర్చుకో...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...