Sunday, April 4, 2021

శివోహం

నా మనసెప్పుడూ రగిలే అగ్నిగోళమే...
ఎప్పుడు కోరరానివి కోరుతూనే ఉంటుంది...
నా మనసేరిగిన మహాదేవుడవు నీవు...
నా కళ్ళలో నీ రూఫు కరిగిపోనీకుండా...
మనసులో సదా నువ్వే నిలిచిపో...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మనసుల్ని ముడివేసి...

నిన్న మొన్నటి పరిచయాన్ని 
జన్మ జన్మల బంధంగా....

లేని బంధంలో తీయని అనుబంధాన్నిచూపిస్తాడు దేవదేవుడు...

అతగాడి తోలుబొమ్మలాటలో బంధాలనే దారాలకి... వేలాడుతున్న బొమ్మలం...

ఎవరికెవరు సొంతమో తెలియని మనసున్న మరబొమ్మలం...

మహాదేవా శంభో శరణు..

శివోహం

మనసుల్ని ముడివేసి...

నిన్న మొన్నటి పరిచయాన్ని 
జన్మ జన్మల బంధంగా....

లేని బంధంలో తీయని అనుబంధాన్నిచూపిస్తాడు దేవదేవుడు...

అతగాడి తోలుబొమ్మలాటలో బంధాలనే దారాలకి... వేలాడుతున్న బొమ్మలం...

ఎవరికెవరు సొంతమో తెలియని మనసున్న మరబొమ్మలం...

మహాదేవా శంభో శరణు..

హారేకృష్ణ

అలాంటి వాడు ఒక్కడు చాలు!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఒక్కోసారి జీవితంలో మనకు ఎవ్వరూ సహాయం చేయడం లేదని అనిపిస్తుంది. ఏదో మంచి పని చేద్దామంటే ఎవరూ సహకరించడం లేదని అనుకుంటాం. కానీ సమర్థునికి ఎవరి సహాయం అక్కర్లేదు. ఆత్మవిశ్వాసం కలిగిన వాడు ఒక్కడే సమస్తం సాధించగలడు. అలాంటివాడు తోడు కోసం చూడడు. ఈ విషయాన్ని మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.

ఒక్కడెచాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైనదా
జక్కనొనర్ప గౌరవుల సంఖ్యులు పట్టిన ధేనుకోటులం
జిక్కగనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్‌
మొక్క వడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా!

ఒక్కడు చాలు... ఇతరుల మీద నెపం నెట్టొద్దు. వాడు సహకరించలేదు. వీడు తోడు రాలేదు. వాడు అడ్డు వచ్చాడు కాబట్టి నేను ఈ మేలు చేయలేకపోతున్నాను - ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. చేయాలని లేకపోతే ఊరుకోవాలి. అంతేకానీ చేయడానికి ఎవడో అడ్డు అని చెప్పొద్దు.

 నువ్వు చేయదలచుకుంటే ఎవడూ అడ్డుకోలేడు. నిశ్చలంగా ఉండి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు  ఒక్కడు చాలు. ఎంతటి బృహత్కార్యమైనా చక్కబెట్టుకోగలడు. దానికి ఉదాహరణ లక్షల మంది సైన్యంతో వచ్చి గోవులను ఆక్రమించిన దుర్యోధనుణ్ణి అర్జునుడు ఒక్కడే ఎదిరించి నిలబడ్డాడు. తన బాణాలతో అర్జునుడు ఒక్కడే మొత్తం సైన్యాన్ని ఓడించాడు. అస్త్రసంపదతో పాటు ధైర్యం కూడా ఉంది కాబట్టే అర్జునుడికి విజయం సాధ్యమయింది.
----గరికిపాటి నరసింహారావు

ఓం నమో నారాయణాయ🙏

హారేకృష్ణ

భవబంధాలు.....

ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే. అసత్యాలే..

చిన్న కథ...

ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తికాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చేడు.

.....

.....

"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావ్..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్చేడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగేడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పేడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయేడు.

అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించేరు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించేరు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసేను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.

మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు. 

సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.

ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరికదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు. ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..! నేను ఈ ప్రపంచంలోని అసారత్వాన్ని తిలకించాను. అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మతోటిది మాత్రమే అని గ్రహించేను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయేడు...

|| ఓం నమః శివాయ ||

శివోహం

శివుడంటే ఆలోచన...
శక్తంటే ఆచరణ...
ఈ రెండూ విడదీయరానివి...
ఆలోచన లేని ఆచరణ...
ఆచరణ లేని ఆలోచన లోకానికి అవసరం లేదు...
కనుక, ఈ రెండిటి సమన్వయధార, శ్రీవిద్యాస్వరూపంగా, యోగత్రయ శక్తిగా, శంకరులు సౌందర్యలహరిని సృష్టించారు.  శ్రీవిద్య ద్వారా, శ్రీచక్రోపాసన ద్వారా, కవితాగానం చేస్తూ అమృత భాషలో భగవత్పాదులు సాగించిన ఆనంద-సౌందర్యలహరిని.. గాఢంగా, తీవ్రంగా అధ్యయనం చేయాలి. శక్తి నుండి పుట్టిన పరాగ రేణువును బ్రహ్మ గ్రహించి లోకమును సృష్టిస్తున్నాడు.
ఒక్క శిరసుతో ఆ రేణువును మోయలేని విష్ణువు, పదివేల శిరసులున్న శేషుడై మోయగలుగుతున్నాడు. పరాగ రేణువును చూర్ణము చేసి, విభూదిని ధరించి శివుడు లయకార్యమును నిర్వహిస్తున్నాడు.
ఈ ముగ్గురూ తమ శక్తులను ఆమె పాదపద్మ పరాగ రేణువు నుండి గ్రహిస్తున్నారు. ‘సౌందర్యలహరి’ ఈ విధంగా సాగుతుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క చక్రంలో బీజాక్షరాలున్నాయి. అదొక తీవ్ర విచారణ!

శంకర భగవత్పాదులు లలితా సహస్ర నామ స్తోత్రానికి భాష్యం రాయలేదు. ‘సౌందర్యలహరి’ని రచించి ఆ లోటును పూరించారు.
లలితా సహస్రనామ స్తోత్రానికి సౌందర్యలహరి, శ్లోకరూపంలో ఉన్న భాష్యమే! అనేక శాస్త్రాల రహస్యం తెలిసి, కవితామృతం రుచి ఎరిగి, మరిగి, అనల్పకల్పనా శక్తి కలిగి శ్రీవిద్యను ఉపాసించాలన్న తీవ్ర కాంక్షలున్నవారికి సౌందర్యలహరి, నిజానికి అసలు విద్య.
అది అనుగ్రహించేది అచ్చ తెలివినే. అనేక స్థాయుల్లో ఆకళింపు చేసుకోవాలి. వైకల్యం సాధించుకోవాలి. దేశ, కాలాతీతంగా భగవత్పాదులు మానవాళికి అనుగ్రహించిన సంవిద్‌ఫలం, సౌందర్యలహరి

శివోహం

నీవు నన్ను ఎప్పుడు పిలుస్తూనే ఉంటావు...
కానీ అహంకారాల హాహాకారలతో...
వినిపించుకోలేని వెఱ్ఱివాడిని నేను...
ఓపట్టు పట్టు పరమేశ్వరా....
మహాదేవా శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...