Monday, April 26, 2021

శివోహం

మన సమస్త దుఃఖాలకు, అశాంతికి మనలోని భావదోషాలే కారణం. ఈ విషయం అవగాహన అయినప్పుడు సుఖశాంతుల కోసం ఎక్కడెక్కడో వెతకం. మన మనసును శుద్ధిచేసుకుని సుఖశాంతులను పొందవచ్చు. మనసుకు అలవాటైన తలపుల నుండి అభ్యాసంతో విముక్తి పొందవచ్చు. దేవాలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ మంచి వారుగానే కనిపిస్తారు. కానీ మనిషి నిజమైన మంచితనం సమాజంతో తాను కొనసాగించే సత్సంబంధాలతోనే ఉంటుంది. తాను కాకుండా ఇతరులంతా కలిసింది సమాజం. తల్లిదండ్రులు, భార్యపిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు, సహోద్యోగులు చివరికి గురువుతో సహా వీరితో మన ప్రవర్తన ఎలా ఉందో మనకు మనమే తెలుసుకోవచ్చు. దైవంవద్ద, గురువువద్ద వినయంగా ఉండి తనకు తానుగా మంచివాడనుకుంటే సరిపోదు. ధర్మజీవనం అలవాటైతే గాని మన జీవితంలో ఎవరితో ఎంతవరకు ఎలా ఉండాలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరితో అవసరమైనంత పరిమితంగా ఉంటే అదే వైరాగ్యాన్ని అలవరిస్తుంది. అప్పుడు భావదోషాల నుండి విముక్తి లభిస్తుంది !

_*"సృష్టి నీ ఉనికిని తెలుపుతుంది.. నీవు నీ స్వరూపం తెలుసుకో..!"

శివోహం

మనసు అంటేనే ప్రాణం...
ప్రాణం లేని శవానికి మనసు ఉండదు. 
ప్రాణం పోవడం అంటే ,ఆత్మస్వరూపం అయిన ఈ  మనసు ,తాను ఆశ్రయించి ఉన్న  జీవుడిని ,దేహి శరీరంలో నుండి  వాయువు రూపంలో  బయటకు  తీసుకెళ్లడంఇదే మరణం...
మనసు ,ప్రాణం జీవుడు ఇవన్నీ ఒకటే...
స్వరూపాలు వేరు పని చేసే తీరు వేరు అంతే...
చివరకు ప్రాణం ,మనసు ,జీవాత్మ లేని శరీరం , పతనమై , పంచభూతాల్లో కలిసిపోతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

Sunday, April 25, 2021

శివోహం

నీ మనసే నీకు కష్టాలకు బాధలకు గురి చేస్తున్నది
నీ మనసుతో జాగ్రత్తగా నడుచుకో 

లేకపోతే అది నిన్ను శాంతిగా 
ఉండకుండా చేస్తుంది 

నీ మనసును ఎప్పటికప్పుడు శుద్ది చేస్తూ
శాంతంగా ఉండటం అలవాటు చేసుకో 

నీ మనసు శాంతిగా ఉంటేనే ఆనందం
ఆ ఆనందమే పరమానందం నిజమైన ఆనందం 

ఓం నమః శివాయ...
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, April 23, 2021

శివోహం

కష్టాలు ఎదురౌతున్నాయని కుమిలిపోకు. జన్మజన్మల దుష్కర్మల వలన వచ్చిన ఈ కష్టాలు మన పాపాల ప్రారబ్ధం నుండి విముక్తిని చేస్తున్నాయి. అలానే సుఖాలు దరి చేరాయని పొంగిపోకు. జన్మజన్మల సత్కర్మల పుణ్యం తరిగిపోతుందని గ్రహించు.  పుణ్యంను హరించే సుఖం కన్నా పాపాలను హరించే దుఃఖమే శ్రేయోదాయకమంటారు 

*శ్రీ  సుందర చైతన్యానందులవారు*

శివోహం

దైవంకోసం, దేవతానుగ్రహంకోసం ఎప్పుడూ ఎదురు చూడకుండా, బైటనుంచి ఎటువంటి సహాయం కోసం చూడకుండా, ఎప్పడూ దేనికీ ఎవరిమీద దేనిమీద దేనికోసం ఆధారపడకుండా, ప్రతిఒక్కరూ ప్రతిక్షణం తమను తాము ఏ అరమరికా లేకుండా, ఎటువంటి దురాభిమానం పక్షపాతం, స్వార్ధం లేకుండా, లోపల బైటా పరిశీలించుకోవాలి,పరీక్షించుకోవాలి,పరిశోధించుకోవాలి. పాపం, హింస, వాంఛ, మోహం, స్వార్ధం మొదలగువాటికి జీవనగమనంలో చోటులేకుండా, దయ, ప్రేమ, కరుణ, సమానత్వం కలిగి... అందరూ అంతా ఒకటే, సమానమే ఆన్న ఏకత్వభావంతో, దృఢసంకల్పంతో సాధన చేస్తూ సన్మార్గవర్తనులై జీవించాలి...

ఓం శివోహం.. సర్వం శివమయం

Thursday, April 22, 2021

శివోహం

శివ!!! నీవు నాకు కనిపించక లేదను...
నీవు లేవని అనను నేను...
నీవే ఏదో నాడు దర్శనం ఇస్తావు...
నన్ను కైలాసం కు తీసుకు వెళ్తావు...
అప్పటి వరకు ఓం నమః శివాయ నే...

మహాదేవా శంభో శరణు

Wednesday, April 21, 2021

శివోహం

ఈ ప్రపంచాన్ని పాలించేవారు ఒకరు వున్నారు.
ఆయనే భగవంతుడు.

పాలించడమే కాదు, భరిస్తున్నది కూడా ఆయనే...

మనం భరిస్తున్నామనుకోవడం వెర్రితనం....

పరమేశ్వరుడే సకల భారాలను భరిస్తున్నాడు..
కానీ, నీవు 'నేను భరిస్తున్నాను' అని అనుకుంటున్నావు....

నీ బాధ్యతలు, భారాలూ భగవంతునిపై వుంచి
నీవు నిశ్చింతగా ఉండు సరంతర్యామి ఐనా శివుడే చూసుకుంటాడు...

ఓం శివోహం... సర్వం శివమయం

  https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! ఎప్పుడూ మూసి ఉండడానికి మూడు కన్నులెందుకయా ముక్కంటిశ... మాయలో మా కన్ను మూసుకొన్న...