Monday, May 3, 2021

శివోహం

శంభో...
ఏమిటి నీ లీల...
అంతా శూన్యంలాగే అనిపిస్తుంది...
ఎక్కడో ఓ మూల భయం, ఆందోళన
ఏమీ సాధించలేదు అనే బాధ...
ఓ మంత్రం రాదు, పూజ చేతగాదు
గురూపదేశం లేదు, సాధనలేదు
ఈ కట్టె ఇలా కాలిపోవాలసినదనే
కలలో కలంలో తప్ప ఇలలో కనిపించవా కపాలధారీ...

మహాదేవా శంభో శరణు...

Sunday, May 2, 2021

శివోహం

జనన మరణాలనే రెండు ఒడ్డుల కూడిన సాగరం లో  
వచ్చిపోయే కెరటాల వలె నానా జన్మల పాలై
రాగ ద్వేషాలనే సుడిగుండంలో చిక్కుకుని
భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల
కోరలకు చిక్కి చితికిపోతున్న నాకు  మత్స్యరూపధారి
శివ నీవే దిక్కు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివాలయం కు వెళ్లకుండా ఉండగలవేమో కానీ....
స్మశానం కు వెళ్లకుండా ఉండగలవా...
అక్కడ ఇక్కడ ఉండేది ఒకే ఒక్కడు...
ఓం నమః శివాయ

శివోహం

నా మనసంతా బాదామయమైనప్పుడు...
నా గుండె నిండ దుఖాలు ఆవరించినప్పుడు...
మనసారా నిన్నే తలుచుకుంటాను తండ్రి...
నేను పలికే ప్రతిమాటలో నీ పేరు ఉంటుంది...
నా శ్వాసలో నీ స్మరణ ఉంటుంది...
నా ఊహల ఊయలలో నీ రూపం కనిపిస్తూనే ఉంటుంది...

మహాదేవా శంభో శరణు...

Saturday, May 1, 2021

శివోహం

సర్వసృష్టి సమానత్వం శివతత్త్వం...
ఆస్తికుడు, నాస్తికుడు, జ్ఞాని, అజ్ఞాని, దేవతలు, రాక్షసులు, బలవంతుడు, బలహీనుడు, సర్వగ్రంధ పారాయణుడు, నిరక్షరాసుడు....
అందర్నీఆదరించి అనుగ్రహించే ప్రేమపరవశుడు శివయ్య.
రావణుడు రాక్షసుడని తెలిసినా అనుగ్రహించాడు.... భస్మాసురుడు కృతఘ్నుడని తెలిసినా వరమిచ్చాడు.... దోషభూయిష్టుల్ని సైతం నెత్తిన పెట్టుకొనే భక్తసులభడు శంకరుడు...
ఎంతటి పాపచరితులనైనా పునీతం చేసే దయాంతరంగడు....

ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

పదములకే పేదవాడను
హృదయమున నిన్నే ఆరాధించే ధనికుడను
నీ నామస్వరమే నా ఆదాయం
ఈజన్మనెలా గెంటేసినా
మరుజన్మనైనా నీసన్నిధిలో ఇలా
నవ్వుతూ బ్రతికే వరానీయవా శివా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

నిస్వార్థంగా ఆలోచిస్తే అందరూ మంచివారే...
నీ స్వార్థంగా ఆలోచిస్తే అందరూ చెడ్డ వారే..
పుట్టుకతోనే గ్రుడ్డి వారిగా, చెవిటి వారిగా, మూగ వారిగా పుట్ట వచ్చును..
కానీ....
పుట్టుకతోనే ఎవ్వరూ చెడ్డ వారిగా మాత్రం పుట్టరు...
గతం నుండి మోసుకు వచ్చిన సంస్కారాలు, వాతావరణ ప్రభావం, మానసిక వివేకం ప్రభావితం చేస్తాయి..
అందుకే పెద్దలు అంటారు సత్ సాంగత్యం తేల్చుతుంది...
కుస్సంగత్యం ముంచుతుంది.....

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...