Thursday, May 6, 2021

శివోహం

*మానవుని మూడు కోరికలు.....*

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు...

అనాయా సేన మరణం, వినా దైన్యేన జీవనమ్ |
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే ||

ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం... ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది...

ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...

బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...

అంతిమ లక్ష్యం, జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి.. చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు...

*|| ఓం నమః శివాయ ||*

శివోహం

విధి అంటూ  ఏదీ లేదు 
       

మన జీవితం మన ప్రారబ్ద 
మన కర్మల పర్యవసానమే   !!
ఈ విధంగా మనమే మన కర్మలను
రూపొందించుకొంటున్నామంటే
వాటిని నశింపచేసుకోవడమూ
మనకు సాధ్యమే అన్నది నిజమే కదా  ? "

గొంగళిపురుగు తన దేహంనుండి స్రవించే
పదార్థంతో తన చుట్టూ తానే గూడు
కట్టుకొని దాన్లో తానే బంధీ అవుతోంది  
అక్కడే ఉంటూ అది
రోదించవచ్చు  ఆక్రోశించవచ్చు 
కాని దాని సహాయానికి
ఎవరూ రారు 

చివరకు అదే జ్ఞానం పొంది అందమైన
సీతాకోక చిలుకలా బయటకు వస్తుంది

ప్రపంచిక బంధాలకు సంబంధించిన
మన పరిస్థితీ ఇదే  .........

యుగయుగాలుగా మనమూ
జనన మరణ చక్రంలో తిరిగివస్తున్నాం
ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాం 
మనం బందీగా ఉండడం గురించి
విలపిస్తూ దొర్లుతున్నాం
కాని  ఏడ్వడం వలనా
వాపోవడం  వలనా
ఏం  ప్రయోజనం లేదు

ఈ బంధాలను చేధించడంలో
మనం అకుంఠిత ప్రయత్నం చేయాలి అన్ని బంధాలకు ముఖ్యకారణం - అజ్ఞానం  

మనిషి స్వభావరీత్యా
దుష్టుడు కాడు  ఏనాడు కాడు
అతడు స్వభావరీత్యా పవిత్రుడు
పూర్తిగా  పావనమైన వాడు
ప్రతి మనిషీ దైవాంశసంభూతుడు

శివోహం

భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలంటే..?

 భగవంతునికి ప్రసాదం ఎందుకు పెట్టాలని తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదావాల్సిందే. సాధారణంగా తమ మనోవాంచలు నెరవేర్చుకోవడం దేవతలకు పూజ చేసి ప్రత్యేక రోజులలో ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. ఇది సరైనా పద్దతేనా అంటే.. ఆధ్యాత్మిక పండితులు ఏం చెప్తున్నారంటే.. భగవంతుడు సర్వశక్తిమంతుడు.

 వాస్తవానికి అతడు భక్తుడి నుండి ఏమీ ఆశించడు. అతను మనఃస్పూర్థిగా ఇచ్చినదేదైనా సంతోషంగా స్వీకరిస్తాడు. అది ఫలమైనా, పుష్పమైనా ఏదైనా సరే. అది కూడా భక్తుని సంతృప్తి పరచడానికే తీసుకుంటాడు.

 కనుక తన సంతృప్తికై భక్తుడు తన ఇష్టదైవానికి తీపి వంటకమో, పుష్పమాలయో, ధూపదీపాలో లేక మరే ఇతరమైనవో సమర్పించుకుంటాడు. అంతే కాని ఏ దేవుడు నాకిది కావాలని అడగడు. ఇచ్చింది కాదనడు. దైవానికి నైవేద్యం సమర్పించడమంటే భగవంతుడికి పూర్ణంగా శరణు జొచ్చడమని భావం.

 దేవుని పూజకు కావలసినవి సమర్పించిన తరువాత భక్తుడి ఆత్మవిశ్వాసం, దైవవిశ్వాసం పెరిగి తన ప్రార్థనా లక్ష్యంపై మనసు సంపూర్ణంగా లగ్నం కాదు. ప్రసాదం అంటే దేవునికి లంచం ఇవ్వడం కాదు.

 భక్తుడు తనకోసమై తనదనుకుంటున్న సొత్తును కాస్త భగవంతుడికి అర్పించడం. అలాగే అది తనకు భగవానుడే ఇచ్చాడు అని భావించడం అనేది నైవేద్యం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

శివోహం

నీవు నా అమ్మవు...
నేను నీ బిడ్డను...
అందుకే నాకు ఈ ప్రశాంతత!
అమ్మ శరణు...

Wednesday, May 5, 2021

శివోహం

నీ దరి జేరగ యే దిక్కున పయనించాలో ...?
నీ దివ్యమంగళరూపం కోసం యే కంటితో చూడాలో ...?
ఈ పాడు మనసుకు తెలియరాదేమి తండ్రీ ...

ఎటువైపుచూసినా,ఎటువెళ్ళినా ఇంకా యెంతెంతోదూరం ...

ఊపిరి ఉన్నంతవరకూ ఆగిపోవాలని లేదు ...
ఆగితే ఊపిరాడదు ...
నా పయనమెటో  తెలియనేలేదు ...

దిక్కలేని వారికి దేవుడే దిక్కని పెద్దల వాక్కు ...
ఒక్కటిమాత్రం నిక్కచ్చిగా తెలుసు తండ్రీ ...

నా లక్ష్యం నిను పొందుటయే ...

మహాదేవా శంభో శరణు....

శివోహం

మనస్సుకు శరీరానికి వేసుకున్న గట్టి ముడి పేరే దుఃఖం
ఆ చిక్కు ముడిని తెలివితో విప్పితే సుఖం...

ఓం నమః శివాయ...

శివోహం

బంధాలు...
భాద్యతలు...
ప్రేమలు...
అభిమానాలు అన్ని జగన్నాటకంలో మొహాలు...
ఈ బతుకు పయనంలో...
మన రాక ఒంటరే...
పోక ఒంటరే...
చివరికి మనకి మనమే మిగిలేది...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...