Thursday, May 13, 2021

అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే

సకల సిరిసంపదలున్నా శాంతిమయ జీవనానికి హామీ లేదు...
సర్వాధికారాలున్నా భద్రమయ జీవనానికి భరోసా లేదు...

సమస్త బంధుబలగం చుట్టూ ఉన్నా సుఖమయ జీవనానికి ఆసరా లేదు....

మనమెంత జాగ్రత్తగా ఉన్నా, ఒకోసారి ఎదుటివారి అజాగ్రత్త మనల్ని బాధలకు గురి చేస్తుంటుంది...

ఏది ఏమైనా అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః
ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

నా ఊపిరి
నా చూపు
నా ప్రాణం
నా పయనం అన్నీ నీవే...
నా చివరాఖరి చూపు కూడా నీ వైపే తండ్రి...

మహాదేవా శంభో శరణు...

Wednesday, May 12, 2021

శివోహం

ఎవరిని అంటే ఎవరు ఊరుకుంటారు తండ్రి...
నాగోడు నీకుగాక ఇంకెవరికి చెప్పుకోవాలి
సంపదలు ఇచ్చేది నీవే కాదనను
కానీ కష్టాలు కూడా నీవే ఇస్తున్నావు
సుఖపడిన రోజులు మరచి
బాధలలో నిన్ను నిందిస్తున్నాను నన్ను మన్నించు శివా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

సిత్రాలు సేసేడు నిత్యగంగాధరుడు
పంచభూతాలలో ఎప్పుడూ సేదతీరుతూనే ఉంటాడు...
ఉన్నోడయినా లేనోడయినా చివరకు చేరేది ఆయన పాదాల చెంతకే...
అందుకే ఉన్నన్నాళ్ళు పంచాక్షరీ మంత్రంతో ఓం నమః శివాయ  అని జపించండి అవ్యయ మోక్షము పొందండి...

ఓం శివోహం... సర్వం శివమయం

Tuesday, May 11, 2021

శివోహం

శంభో...
నేను నిన్ను నా గుండెల్లో నింపుకొన్నప్పుడు
కైలాసంలో కట్రాడు దగ్గర కాస్తంత
చోటీయలేవా...
బంధాలు బాంధవ్యాలు తరిమేస్తున్నాయి అలసిపోతున్నాను.
నన్ను ఆదుకోవాగా రాలేవా...
మంద బుద్ధి కలిగిన ఈ పశువును కట్టిపడేయవా శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

తీవ్ర  వైరాగ్యం  మోక్షానికి ప్రథమ కారణం

జ్ఞానం  ఎలా  వస్తుందంటే  శ్రవణ,  మనన,  నిదిధ్యాసనాల  ద్వారా  వస్తుంది.  ప్రాపంచిక  విషయచింతన  లేకుండా  వైరాగ్యం  సహాయం  చేస్తుంది.  మరి  ఆత్మ  చింతన  ఎలా  కలుగుతుందంటే  ముందు  దాని  గురించి  వినాలి.  దాని  గురుంచి  వినకుండా  దానిని  చింతించలేవు  కదా!  దానిగురించి  వింటే  నీకు  మననం  చేయబుద్ధి  పుడుతుంది.  మననం  చేయగా  చేయగా  నీకు  దాని  మీద  ధ్యాస  కలుగుతుంది.  అప్పుడా  ధ్యాసే  ధ్యానం  క్రింద  మారిపోతుంది.

శివోహం


  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...