Friday, May 28, 2021

శివోహం

నీ ఆరాధనే నా ధనము...
నీ దర్శనమే నాకానందము..
శివా నామ స్మరణే నా సంతోషము...
మహాదేవా శంభో శరణు...

శివోహం

భయమును  సృష్టించేవారు, తీసేసే వారు పరమాత్మే.  కనుక  మనమెప్పుడు పరమాత్మని  ప్రసన్న వదనంతో వున్న మూర్తియై కనపడమని కోరుకోవాలిట. కష్టము కలిగించే వాడు పరమాత్మే, కష్టాన్ని తీసేసే వాడు పరమాత్మే. కష్ట కాలములో తనని మర్చిపోయేటట్టు చేసేది పరమాత్మే. మనస్సులో పరమాత్ముని పాదములు  వదలకుండా పట్టుకుని, నన్ను మన్నించి నీ  త్రోవలో నన్ను పెట్టుకో అని మనః స్ఫూర్తిగా ప్రార్దించినట్లైతే, అయన సంతోషించి, మనకు  కలిగిన గాయాన్ని మాన్పించి యధా మార్గంలో పెడతారు. 

ఓం శివోహం...సర్వం శివమయం

Thursday, May 27, 2021

శివోహం

శంభో...
నేను నిన్ను నా గుండెల్లో నింపుకొన్నప్పుడు
కైలాసంలో కట్రాడు దగ్గర కాస్తంత
చోటీయలేవా...
బంధాలు బాంధవ్యాలు తరిమేస్తున్నాయి అలసిపోతున్నాను.
నన్ను ఆదుకోవాగా రాలేవా...
మంద బుద్ధి కలిగిన ఈ పశువును నీ సన్నిధిలో కట్టిపడేయవా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అందరిలోనూ నీవే వున్నావు కదా శివ...
నాలోనూ ఉంటావని నాలో నీ కొరకు వెదుకుతున్నా...
నే చూసే రూపాలలో నీకోసం చూస్తున్నా...

మహాదేవా శంభో శరణు...

Wednesday, May 26, 2021

ఓం

విఘ్న నాయకా ప్రధమ పూజలందుకో...
సమస్త ప్రజలను ఆదుకో...
సమస్త విజ్ఞానము పంచి ఏలుకో...

ఓం గం గణపతియే నమః
ఓం శివోహం...సర్వం శివమయం

శివోహం

నన్ను మేలుకొలిపేదే నీవు నీకు మేలుకొలుపేల తండ్రి...
నేను ఉదయించే వేళ నారాయణ యని
నిదురించే వేళ నమః శివాయ యని
పలకరించి, పలవరించిన పుణ్యము చేతనే
రాత్రంతా నాకొరకు మేలుకొని, కొత్త ఊపిరి పోసి
ఉదయాన్నే అందరితో నన్ను నిదుర లేపుచున్నావు....
నీ మేలు ఎలా మరవగలను తండ్రి...

మహాదేవా శంభో శరణు..

Tuesday, May 25, 2021

శివోహం

అద్దంలోని బింబాన్ని చూసి తృప్తిగా ఉన్నా...
అంతరాత్మలో నీవే నని బ్రమతో ఉన్నా...
శరణాగత వత్సలుడనై వేచి యున్నా...
ఆత్మార్పణ చేయుటకు వెనుకాడకున్నా...

మహాదేవా శంభో శరణు

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...