Friday, June 4, 2021

శివోహం

కాలం మారుతుంది...
గుణాలు మారుతాయి... 
ప్రేమలు ఒక్కటౌతాయి...
ఓర్పు నీకు నేర్పని తెలుసుకో...

ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, June 3, 2021

శివోహం

శంభో...
నీ వెక్కడ ఏ రూపంలో నో ఉంటావో  నాకు తెలీదు...
కానీ నీవున్నావన్న పరిపూర్ణ విశ్వాసంతో నేను నీ కృపకై నిరీక్షిస్తూ ఉన్నా...
అది నిరూపించుకునే బాధ్యత నీదే ఈశ్వరా...
నా రక్షణ భారం కూడా నీదే పరమేశ్వరా...
మహాదేవా శంభో శరణు...

శ్రీరామ భక్త హనుమా

ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్...

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం  సబ్యులకు, పెద్దలకు, గురువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

శివోహం

శంభో...
జ్ఞానం లో నూతనంగా ఆలోచనలు చేయువాడవు నీవు...
నాలోని మనిషిని మేలుకొలిపి నీ గుడి ముంగిట తలవాల్చు రీతిని జాగృతం చేయవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

హరిహారపుత్ర అయ్యప్ప...
నిన్ను జేరవలెనని నా మనసుకు ఉత్సాహము ఉరకలు వేస్తున్నది....

గానీ కానీ చేరుటెట్ల...
నేను లేని వెలితి లేదా తండ్రి....

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...
మహాదేవా శంభో శరణు.....

Wednesday, June 2, 2021

శివోహం

ఈ శరీరం అనే సంపద నీ ప్రసాదమే తండ్రి...
ఈ ఉత్కృష్టమైన మానవ జీవనం  నీ  అపార మైన కారుణ్యమే...
నా ఈ దేహంలో ని  వేలాది  నాడులు...
నీ నామ రూప దివ్యగానం చేస్తూ
పాల పొంగులా పొరలే అనందాన్ని
నా ఎదలో  ఉవ్వెత్తున ఉప్పొంగనీ తండ్రి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శివ,
నీవు ఒక్కడే మోక్షకర్తవు...
నీవే శరణాగతుడవు...
సంతోషముతో మన:శాంతినిచ్చేది నీకు ఒక్కడే...
మహాదేవా శంభో శరణు...

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...