Sunday, June 20, 2021

శివోహం

సృష్టి, స్థితి, మరియు లయము లలో  నీవే పరమ సత్యము...
సత్యమునకు మూలము మరియు అంతము నీవే పరమేశ్వరా...
సమస్త సత్యమునకు సారము నీవే...

ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, June 19, 2021

శివోహం

విశ్వాసమున్న చోట ప్రేమ...
ప్రేమ గలచోట శాంతి...
శాంతి వున్న చోట సత్యము...
సత్యముగల చోట ఆనందమూ...
అక్కడే భగవంతుడు వుంటాడు...
శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారు.

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, June 18, 2021

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నను నడిపించే వాడివి నువు నా అండ ఉండగా....
వేరెవరూ తోడు రాకపోయినా భయపడను తండ్రి...
నీవైపు నేను వేసే నా అడుగులే నాకు ఆత్మబంధువులు...
మహాదేవా శంభో శరణు...

శివోహం

జన్మమేదైనా...
పరిస్థితి ఏదైనా...
కలిమిలేములు సుఖదుఃఖాలు ఏవైనా...
మంచి చెడులు, పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే...

మహాదేవా శంభో శరణు...

శివోహం

భగవంతుడు గుణరహితుడు, దయామయుడు...
పసిబిడ్డ ఏడుపుకు తల్లి ఏవిధముగా తల్లడిల్లి పోతుందో అదేవిధముగా కలియుగాన్ని భక్తులను రక్షించుటకు పార్వతీ పరమేశ్వరులు తల్లడిల్లి పొతూ ఉంటారు...
శివుణ్ణి తలిచిన వారిని ఆదుకొని ఆనందాన్ని ప్రసాధిస్తారు...
ఓం శివోహం... సర్వం శివమయం

Thursday, June 17, 2021

శివోహం

మానవుని దేహానికి శివం అని పేరు.
శివం అనగా మంగళకరం అని మరో అర్థం. సదాలోచనలు, సచ్చింతనలతో దేహాన్ని శివంగా మార్చుకోవాలే తప్ప దుర్భావాలు,దుశ్చింతనలతో దానిని శవంగా మార్చుకోకూడదు.
దేహనికి సార్థకతను చేకూర్చే కర్మలనే చేయాలి. అపుడే భగవంతుని అనుగ్రహం పుస్కలంగా పొందవీలవుతుంది.

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...