Sunday, July 4, 2021

శివోహం

ఆది,అంతం లేని అనంతరూప దారి...
ఎన్నాళ్ళు నీవు నా కాపలా తండ్రి...
నన్ను నీలో ఐక్యం చేసుకో
నంది పక్కనే పడి ఉంటా...

మహాదేవా శంభో శరణు...

Saturday, July 3, 2021

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

భాహ్య విషయాలతో భగవంతుని అనుసందానం చేయకూడదు.వాటి అవసరాల కోసం భగవంతుని ప్రార్థించకూడదు. చెడుకు దూరంగా, మంచిలో బ్రతికేందుకు ప్రార్ధించాలి...

ఈ దేహమూ, ప్రాణమూ భగవంతునిదే కనుక ఈ జీవితాన్ని ఆయనకు ఇష్టం వచ్చిన రీతిగా మలచుకొమ్మని ప్రార్ధించాలి. మనకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉంటూ పదిమంది మంచికొేసం ప్రార్ధించాలి.నిత్యమూ ఆయన సృహలొనే ఉండేలా చేయమని ప్రార్ధించాలి...

ప్రార్ధన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చకున్నా అది మన మనస్సును ప్రభావితం చేయగలదు. కనుక జీవితంలొే ప్రార్ధన అనేది ఒక బాగమైపోయేలా చూసుకోవాలి...

ఓం శివోహం... సర్వం శివమయం
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప

శివోహం

శరీరం దైవదత్తం
మనస్సు మానవ కల్పితం 
బుద్ధిని శుద్ధి చేసుకుంటే మోక్షసిద్ధి తధ్యం

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, July 2, 2021

శివోహం

శివ...
భౌతిక మౌనం తేలికగా ఉన్న....
నా మనసు అదుపులో లేక పరిపరి
విధముల అదుపు తప్పుతోంది...
మట్టు పెట్టు నా మనసుని...
అట్టి పెట్టు  నీవు నాకు తెలిసేట్టు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

నీ సన్నిధికై తపిస్తున్నా...
నీ స్మరణతో జీవిస్తున్నా...
నీ లోనే లయమౌవ్వాలని శ్వాసిస్తున్నా...
నీ ముందు చిరు దీపం లా వెలగలని...
మహాదేవా శంభో శరణు....

Thursday, July 1, 2021

శివోహం

శంభో...
నేను ఉదయించే వేళ నారాయణ యని
నిదురించే వేళ నమః శివాయ యని
పలకరించిన...
పుణ్యము చేతనే రాత్రంతా నాకొరకు మేలుకొని...
నాకు కొత్త ఊపిరి పోసి ఉదయాన్నే అందరితో నన్ను నిదుర లేపుచున్నావు...
అంత నీ దయ స్వామి...
మహాదేవా శంభో శరణు...

శివోహం

ఎన్ని మహాయుగాలైనాయో...
ఎన్ని మాయల ఊయలలూగానో...
ఎన్ని కోరికల గుర్రాలెక్కానో...
ఎన్ని పాపపు కోటలు మూట కట్టానో...
ఎన్ని జన్మలలో ఏ మూలనో చేసిన పుణ్యం
నిన్ను ఎన్నుకున్నాను...
ఎంచకు నా తప్పలను అలసిపోయిన నా మనసుకు వయసుకు తోడుగా నిలబడవా...
మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...