Wednesday, August 18, 2021

శివోహం

శివా!మా వెనువెంటే నీవంటే
ఏమేమో అనుకున్నా
వెనుతిరిగి చూడ నాకు విస్మమయమే
మహేశా . . . . . శరణు .

శివోహం

ఉదయకాలపు బ్రహ్మవు...
మధ్యాహ్న రుద్రుడవు...
సాయంకాల నారాయణుడవు...
నీవే నా మదిలో మెదిలే దేవదేవుడవు...
సోమ,  సూర్య, అగ్నులు నేత్రాలుగా గలిగిన దేవా...
ఆతేజములే మాకు మూడు రూపాలుగా  అగుపించెను పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

Tuesday, August 17, 2021

శివోహం

శివా!విశ్వ నేత్రము నీవే
జగతి ఛత్రము నీవే
ముక్తి సూత్రమూ నీవే....
మహేశా ..... శరణు..

శివోహం

శంభో...
నువ్వు రచించే మాయలోని నీకిష్టమైన పాత్రలం మేము...
నువ్వు వచించే  మాటల్లోని అందమైన భావాలం...
నువ్వు దీవించే కాంతులలోని చైతన్య కిరణాలం...
నువ్వు ఒకడివి ఉన్నావని తెలిసినా తెలియదన్నట్టు తిరిగే అజ్ఞానులం...
మేమెలా ఉన్నా నువ్వు మాత్రం అలాగే ఉంటావు
మాలో మాకే అర్థం కాని నువ్వు లా...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శంభో...
నీకు నాకు మధ్య ఎంత దూరం...
గుప్పెడంత గుండె దూరమే కదా...
నా గుండెలో నీవుంటే ఓం నమః శివాయ
నా ఊపిరిలో ఉంటే శివోహం
నా కళ్ళల్లో ఉంటే పరమేశ్వరా...
నిజంగా ఎంతో దూరంలో లేవు నీవు నాకు...
నాకు దారిచూపేందుకు నా దరిదాపులోనే ఉన్నావు కదా తండ్రి... 

మహాదేవా శంభో శరణు...

శివోహం

శంభో...
నా మనసు నీ తలపులపై నిలవగా...
నీ నామము మననంతో మౌనం అలవడి
అనుదినం నీరూపు రేఖల విభూతిని
అనుభూతిగా ఆనందించు చున్నావు..
అలాగే నా మదిలో స్థిరంగా నిలిచిపో...

మహాదేవా శంభో శరణు...

Monday, August 16, 2021

శివోహం

శివా!రానని కాదని అనగ వీలులేదు
నిను చేరుట అన్నది తధ్యము
అది నేడో రేపో అగోచరము
మహేశా.....శరణు..

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.