Tuesday, September 7, 2021

శివోహం

శంభో...
నీ సన్నిధికై తపిస్తున్నా...
నీ స్మరణతో జీవిస్తున్నా...
నీ లోనే లయమౌవ్వాలని శ్వాసిస్తున్నా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

గణనాథుడిని నిరతము నమ్మి కొలిచితే నిత్యానందమే కాదా...

ఓం గం గణపతియే నమః.

Monday, September 6, 2021

శివోహం

శివా!అణువంత నీవే అనంతమవుతూ
అనంతమైన నీవు అణువంత అవుతూ
అయోమయము కల్పించి ఆడుకుంటున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో
మాతో ఇన్ని ఆటలు ఆడిస్తావు...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా  మార్చి ఆనందంగా ఆడుకుంటూ ,లీలగా వినోదిస్తూ మాలో అంతర్యామిగా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో, అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు
ఇదంతా ఏమిటి స్వామీ అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Sunday, September 5, 2021

శివోహం

శివా!సాధన చేయగ దేహాన్ని యిచ్చి
సందేహములు తీర్చ గురువుగా వచ్చి
గతినెరుగ జేసేవు గమనాన నిలిచి
మహేశా . . . . . శరణు .

శివోహం

దినదిన గండం నుండి రక్షించు
ధీనభందువుడవు నీవు...
ఈ విశ్వమంతా నీ అధీనం లొనే...
మహాదేవా శంభో శరణు...

Saturday, September 4, 2021

శివోహం

అజ్ఞానమనే అంధకారంచే కప్పబడి ఉండే నా కండ్లను... 
దీక్షా అనే శుద్దజ్ఞానంతో నాలో అజ్ఞానంను తొలిగించి  విజ్ఞానంను పంచి నా జీవితం ను ముందుకు నడిపిన గురువులకే గురువు ఐనా అయ్యప్పస్వామికి నమస్కారం.... 

ఓం నమః శివాయ 
ఓం శ్రీస్వామియే శరణం అయ్యప్ప

ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం సభ్యులకు పెద్దలకు గురువులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.