Tuesday, September 7, 2021

శివోహం

శంభో...
నీవు ఆడుకోవడం కోసం నాకు ఊపిరి పోసి...
నాబ్రతుకు పోరాటంలో ఊపిరి ఆడకుండా
చేస్తున్నావు..
నీకిది న్యాయమా పరమేశ్వరా...
నా బాధలో నిన్నుగాక వేరొకరిని నిందించగలనా...
అయినా నాది నిందకాదు శంకరా ఆవేదన మాత్రమే...
ఆపద్భాందవుడవని బిరుదు నీది...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!"ఓం"కారమున తెలిసె నీ తొలి శిశువు
"ఓం" కారము వివరించె నీ మలి శిశువు
ఆ "ఓం" కార తేజమై వెలిగేది నీవు
మహేశా.....శరణు.

శివోహం

శంభో...
నీ సన్నిధికై తపిస్తున్నా...
నీ స్మరణతో జీవిస్తున్నా...
నీ లోనే లయమౌవ్వాలని శ్వాసిస్తున్నా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

గణనాథుడిని నిరతము నమ్మి కొలిచితే నిత్యానందమే కాదా...

ఓం గం గణపతియే నమః.

Monday, September 6, 2021

శివోహం

శివా!అణువంత నీవే అనంతమవుతూ
అనంతమైన నీవు అణువంత అవుతూ
అయోమయము కల్పించి ఆడుకుంటున్నావు
మహేశా . . . . . శరణు .

శివోహం

శంభో
మాతో ఇన్ని ఆటలు ఆడిస్తావు...
నీ జగన్నాటక చదరంగం లో ఇలా మమ్మల్ని పావులుగా  మార్చి ఆనందంగా ఆడుకుంటూ ,లీలగా వినోదిస్తూ మాలో అంతర్యామిగా ఉంటూ మాతో కర్మలు చేయిస్తూ అవి పూర్తి అయ్యేవరకు కనిపెడుతూ పావులను కదిలిస్తూ ఎక్కడో, ఎప్పుడో, అయిపోయింది అంటూ చివరకు తెర దించేస్తు ఉంటావు మళ్లీ ఆట మొదలు పెడుతూ ఉంటావు
ఇదంతా ఏమిటి స్వామీ అంతులేని ఈ కథ కు అంతు పలకవా తండ్రి...

మహాదేవా శంభో శరణు.

Sunday, September 5, 2021

శివోహం

శివా!సాధన చేయగ దేహాన్ని యిచ్చి
సందేహములు తీర్చ గురువుగా వచ్చి
గతినెరుగ జేసేవు గమనాన నిలిచి
మహేశా . . . . . శరణు .

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...