Monday, September 20, 2021

శివోహం

[9/18, 7:38 PM] Srirangam Jogi FB: శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .


శివా! నీటితో నీ బంధము చెప్పలేనిది
ఒకనాటితో ఆ బంధం తీరిపోనిది
పన్నీరు కన్నీరు నీకు అభిషేకమే
మహేశా ..... శరణు


శివా!అక్షరాలు లేని భాష అలవరచు కున్నాను
లక్షణాలు నీ చెంత నేర్చుకున్నాను
మత్సరాలు లేని జన్మ  కోరుకున్నాను
మహేశా . . . . . శరణు .

శివోహం

శివ...
పిలవగానే పలకలేదని నిన్ను పిలవడం మానను...
మనిషిగా నేను చేసిన తప్పిదాలకు నిన్ను నిందించలేను...
ప్రాణ భీతి కాదిది...
ప్రాణ ప్రయాణ భయం...
నూరేళ్ళు బతికేయాలని కాదు....
ఉన్న నాలుగు రోజులు నీ నామ స్మరణతో ఆనందంగా ఉండాలని దివించు...

మహాదేవా శంభో శరణు.

శివోహం

భక్తియే బ్రతుకు చుక్కాని...
జీవి యాత్రలో గురుదేవుడే మార్గగామి
బాగు చేయును....
భక్తి ఒకటే బ్రతుకు భవ్యము జీవి ధన్యము...
భక్తి లేని జీవి బ్రతుకు నీరు లేని బావి...

ఓం శివోహం...సర్వం శివమయం

Sunday, September 19, 2021

శివోహం

శివ...
కనుల కనిపించే కాంతులు...
కనులు మూసి పిలిచిన వేళ....
గుండె గోడల అగుపించు...
మనసు తెరల మాటునుండి చూస్తాను...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నీ నామస్మరణ తలపులలో నిలిచి గూడుకట్టుకున్నవి...
నీనామ జపంలో సర్వం మరచి మనసులో మైమరచి ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందుతున్న వేళ మౌనం సామ్రాజ్యం ఏలుతూ స్మరణ మనన ధ్యాన ధ్యాసలు నలుదిశలుగా భావించే భాగ్యం కలిగించవా...

నీరూపం చూడగానే నా మనసు నీవలే ఘడియైనా నిలిచేలా దీవించు తండ్రీ...

మహాదేవా శంభో శరణు.

Saturday, September 18, 2021

శివోహం

గణేశా...
గుణాతీతమైన త్రిమూర్తి స్వరూపము నీవని
భగవద్ జ్ఞానం కోసం అర్ధించుచున్నాము...
నీ కృపా కటాక్షములను మాపై ఉంచుము...

ఓం గం గణపతియే నమః

శివోహం

నా గుండె గూటిలో ఉన్నది నీరూపమే మహాదేవా.. 
నాలుగు గదులు మీరు నలుగురు...
ఊపిరి నందితో నేననునిత్యం నీ
రూపాన్ని నాగుండెపై చిత్రించుకుంటాను...
నిదురలో మెలకువలో మీరే నా ధ్యాస
చెరగనీయకు నీ చిత్రాన్ని
చెదరనీయకు నా హృదయాన్ని

మహాదేవా శంభో శరణు...

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...