Sunday, September 26, 2021

శివోహం

శంభో
ఈ భువిపై నాచే నీవు ఆశించిన 
కార్యములు పూర్తి కాలేదనేనా...

ఈ యాతనల యాత్రల పొడిగింపు...
లోతు తక్కువ కొలనులు ఈద గలిగినా ప్రవాహాలు దాటలేకపోతున్నాను పరమేశ్వరా...
నీ అభయహస్తం అదించి నీ దరికి చేర్చు...

మహాదేవా శంభో శరణు...

Saturday, September 25, 2021

శివోహం

శివా! ఎదురు చూపుకు ఎదురు కావు
ఎదను చూపులు నాకు రావు
ఎదుటపడుట ఎలా ? ఎఱుక చేయవేల.?
మహేశా ..... శరణు.

శివోహం

శివా! విశ్వముతో బంధము  వీడనీయి
విశ్వాత్మతో   ముడి పడనీయి
ఈ నేను మేనుల పోరు ముగియనీయి
మహేశా ..... శరణు.


శివా!ద్వంద గుణములు  దాటలేకున్నాను
ఆద్వైతమును మరి తెలియలేకున్నాను
నీ దయను చూపించు ద్వందమును దాటించు
మహేశా . . . . . శరణు .


 శివా! నీటితో నీ బంధము చెప్పలేనిది
ఒకనాటితో ఆ బంధం తీరిపోనిది
పన్నీరు కన్నీరు నీకు అభిషేకమే
మహేశా ..... శరణు

శివా!అక్షరాలు లేని భాష అలవరచు కున్నాను
లక్షణాలు నీ చెంత నేర్చుకున్నాను
మత్సరాలు లేని జన్మ  కోరుకున్నాను
మహేశా . . . . . శరణు .

 శివా!నీ సిగ శిఖరం అయ్యింది 
అది గంగకు వాసం అయింది
గగన కుసుమానికి ఆవాసమయ్యింది
మహేశా . . . .  . శరణు .


శివా! గంగమ్మ కొసగేవు కమ్మదనం
చంద్రుని కొసగేవు చల్లదనం
నాకీయవయ్యా జ్ఞాన ధనం
మహేశా...శరణు....


 శివా! నిన్ను అంటి పెట్టుకున్నవారికి శుభయోగం
నువ్వు కంట పెట్టుకున్నవారికి  ఘన తేజం
గుండెలో పెట్టుకున్న నాకు ఏమిటి భరణం .
మహేశా . . . . . శరణు

శివోహం

శంభో...
జరిగినది...
జరుగ నున్నది...
జరిగేది నేవె ఎరుగుదువు...
జరిగిన,జరుగబోయే నా జీవిత కాలము నీవే దిక్కు...
మహాదేవా శంభో శరణు.

Friday, September 24, 2021

శివోహం

శంభో
శిరస్సు వంచి విన్నవించుకొనుచుంటిని నన్ను నీ దరి చేర్చుకో...
ఈ జగతిన జన్మించి బహు దుఃఖములు పొందితి...
ఈ జనన మరణ చక్రములలో బందీనైతిని...
సంసార శోకమును నివారించు హర...
నా కష్టములకు కారణము ఈ కర్మలబంధనములే...
దయతలచి వాటిని త్రెంచుము శంభో ....
ఈ దుఃఖభరితమైన ప్రపంచములో ఎక్కడా కుడా నిజమైన, శాశ్వతమైన ప్రేమ, సుఖం లేనేలేదు...
ఈ శోకసంతాపాల సాగరం నుండి రక్షించి
నన్ను నీ దరి చేర్చుకో శంకరా...
మహాదేవా శంభో శరణు...

శివోహం

శంకరా...
కష్టము నిను తలచుట..
కష్టము నిను విడిచి మనుట...
కష్టము నిను తలుచుట...
కష్టము నిను గుర్తెరుగుట...
ఈ కష్టము ఇష్టము చేయుము కదా శివ...
మహాదేవా శంభో శరణు.

Thursday, September 23, 2021

శివోహం

నీపైన అపార నమ్మకం తో ఈ సంసార సాగరం ఈదుతూ, నిత్యం నిన్ను ధ్యానించు కొంటూ...

కర్తవ్య నిర్వహణలో తలమునకలై ఉన్న నన్ను మరచి , ఏమార్చి వెళ్ళవు గదా...

తండ్రి!ఆ స్మశానం లో బంధుమిత్రులు వదిలి వెళ్ళాక, నీ సాంగత్యం నాకు దొరుకుతుందనే ఒకే ఒక ఆశతో కాలాన్ని వెళ్ళదీస్తున్నాను!

మహాదేవా శంభో శరణు....

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...