Tuesday, September 28, 2021

శివోహం

శివ...
నీ జటాఝూటం నుండి ఉరుకుతున్న గంగమ్మ...

నిను విడవలేక విచారంగా వుందేమో...

అందుకేనేమో...

నా కనుల కొలను నుండి కన్నీటి రూపంగా నిను స్మరిస్తూ బయటకు వస్తోంది.

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివ...
నా కనీటి బాష్పల చాటు...
దాగున బాధల పై ఒట్టు...
నా హ్రుధయం దారులు అన్ని...
నీ భక్తి తో అణువణువు నిండి ఉంది...
మహాదేవా శంభో శరణు...

Monday, September 27, 2021

శివోహం

శివా!చెట్టు కింద స్వామి గుట్టు విప్పవేమి
మౌనమైన బోధలో వున్న మర్మమేమి
ఆత్మబోధ అందువా పరమాత్మ బోధ అందువా
మహేశా . . . . . శరణు

శివోహం

శివ...
నేను నిన్ను నిత్యం చూస్తూనే ఉన్నా ఎందుకో తనివి తీరడం శివా...

మనసుపెట్టి ఓ నిమిషం చూసే భాగ్యం కలిగించు...

నిను చూసే లోపు ఆలోచనలు అడ్డు వచ్చి మనసును దారి తప్పిస్తున్నాయి....

నిత్యం నిన్ను ఆరాధించే అదృష్టం కలిగించు సర్వేశ్వరా.  

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా! గంగమ్మ కొసగేవు కమ్మదనం
చంద్రుని కొసగేవు చల్లదనం
నాకీయవయ్యా జ్ఞాన ధనం
మహేశా...శరణు....


శివా! నిన్ను అంటి పెట్టుకున్నవారికి శుభయోగం
నువ్వు కంట పెట్టుకున్నవారికి  ఘన తేజం
గుండెలో పెట్టుకున్న నాకు ఏమిటి భరణం .
మహేశా . . . . . శరణు


శివా! ఎదురు చూపుకు ఎదురు కావు
ఎదను చూపులు నాకు రావు
ఎదుటపడుట ఎలా ? ఎఱుక చేయవేల.?
మహేశా ..... శరణు.


శివా!కాలమన్నది కరగి పోవును
కర్మ బంధము  కాలి పోవును
మన బంధమే శాశ్వతము
మహేశా.....శరణు.

శివోహం

శివ...
నీ వైపు నే వేసే ప్రతి అడుగూ 
నన్ను నాలోకి నడిపించే దారిలో మజిలీ...
నిన్ను చూపే నా ప్రతి కలా
నా ఉనికిని వెలిగించే వెన్నెల...
నువ్వొక్కటీ నేనొక్కటీ కాదు కదా తండ్రి...
నువ్వే నేను నేనే నువ్వు...
మహాదేవా శంభో శరణు...

Sunday, September 26, 2021

శివోహం

శంభో
ఈ భువిపై నాచే నీవు ఆశించిన 
కార్యములు పూర్తి కాలేదనేనా...

ఈ యాతనల యాత్రల పొడిగింపు...
లోతు తక్కువ కొలనులు ఈద గలిగినా ప్రవాహాలు దాటలేకపోతున్నాను పరమేశ్వరా...
నీ అభయహస్తం అదించి నీ దరికి చేర్చు...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా! నా జీవితంలో ఉన్న సమస్యలలో 99 శాతం సమస్యలు నేను సృష్టించుకున్నవే… ఎందుకంటే నేను జీవితాన్ని గంబిరమైనది అని అనుకున్నారు. శివ నీ దయ శివా!ఏ...