Tuesday, October 12, 2021

శివోహం

శివ
ఏ జన్మలో శాపమో తెలియదు కాని బంధాల వల్ల బాధే కానీ సంతోషం లేదు...

బాధని భహుమతిగా ఇచ్చి ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చూస్తుంది విధి...

విధికి నేను భానిస కాలేను ఆ బాధకి అతిథి సత్కారాలు చెయ్యలెను ఆ ఓపికా నాకు లేదు...

శంభో నీవే శరణు...

Monday, October 11, 2021

శివోహం

శివా!నీవు నామ రూపాలకు అతీతం 
నేను నామ రూపాలకు పరిమితం
నన్ను కరుణించు నా పరిమితి పెంచు 
మహేశా ..... శరణు.


 శివా!గుర్తు తెలియని గమ్యం చేరేదెప్పుడో ?
జనన మరణ భ్రమణం ఆగేదెప్పుడో ?
తెలిసేదెలా ?......కథ ముగిసేదెలా .......?
మహేశా. .....  శరణు.


శివా! ఈ బ్రతుకు బండికి......
ఎద్దు ఎనుబోతుల జోడీ  ఏమిటయ్యా
ఏదో ఒకదానిని  కూర్చవయా
మహేశా......శరణు.


 శివా!నీ ద్వారానికి నేను తోరణమైతే
అదే నాకు ఆభరణం
ఈ జన్మకు భరణం
మహేశా . . . . . శరణు .


 శివా!నా మౌనం మసకబారింది
మౌనం మసకేయ ,మాట ముందుకొచ్చింది
మనసు దిగులుగా ముడుచుకుంది మన్నించు
మహేశా . . . . . శరణు .

శివోహం

ఆలోచనలే నిన్ను బంధిస్తున్నాయి...
ఆలోచనలు వదులుకుంటేనే మోక్షం...
ఆలోచనలు పెట్టుకొని బద్ధుడవు కావడం గాని...
ఆలోచనలు మానుకొని ముక్తుడవు కావడంగాని అంతా నీలో ఉంది..ఎం
ఆలోచనలు మానుకోవాలనే ప్రయత్నం నీవు చేయనక్కరలేదు..
ఆలోచనల మూలమేమిటో అన్వేషించి తెలుసుకో...
అప్పుడు ఆత్మయే ప్రకాశించి ఆలోచనలు వాటంతటవే అంతర్ధాన మవుతాయి...

భగవాన్ శ్రీ రమణ మహర్షి.

Sunday, October 10, 2021

అమ్మ

అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి
అభయహస్తమునిచ్చి ఆశీర్వదించుమా...
వెండికొండపైన వెలసినావమ్మా
ఇంటింట ఇలవేల్పుగా నిలిచినావమ్మా ...
నీ పేరు తలచిన చాలు జరిగేను శతకోటి కళ్యాణాలు....
మముగన్న మా తల్లి అమ్మ దుర్గమ్మ శరణు.

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

ఈ లోకములో ఎవరికి వారే స్వతంత్రులు
ఒకరి మీద మరొకరికి ఎటువంటి అధికారములు లేవు.. 
ఈ లోక సంబంధాలన్నీ కేవలం దైవ భావనతో దైవ ప్రేమతో అవసరానికి వాడుకొని వదిలేసేవే
చివరకు ఒంటరిగా ఈ లోకానికి వచ్చిన తాను ఒంటరిగానే మిగిలిపోవలసిందే...

ఓం శివోహం... సర్వం శివమయం.

Saturday, October 9, 2021

శివోహం

పరమేశ్వరి
అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి 
శ్రీ భువనేశ్వరి
రాజ రాజేశ్వరి
అజ్ఞాన అంధ వినాశ కారిణి
అమ్మ నీ దయ ఉంటే అన్ని ఉన్నట్టే
మాత మము ఆదరింపు

ఓం శ్రీమాత్రే నమః

శివోహం

శివా! ఈ బ్రతుకు బండికి......
ఎద్దు ఎనుబోతుల జోడీ  ఏమిటయ్యా
ఏదో ఒకదానిని  కూర్చవయా
మహేశా......శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...