శ్రీహరి శుభ రూపమితడు శ్రీనివాసుడు
వేడుకున్న వారి వెన్ను కాచుదేముడు
"హరి" జనులను ఉద్ధరించ భువిని వెలసెను
ఆపద మొక్కుల వాడన్న కీర్తి గాంచెను
భార్గవి హృదిలోన నిలచి బ్రహ్మము తానైన వాడు
పురుష రూప ఆదిశక్తి పరంధాముడు.
మంగమ్మ మానసాన మోహనాంగుడు
అన్నమయ్య పద కవితల ఆది దేవుడు
వాడిన పూమాలలతో పడతి పూజలందినాడు
పార్ధివ పుష్పాల కొలువ పరవశించి మురిసినాడు.
ఏడేడు లోకాల ఏలికైన విభుడు
ఏడు కొండలపైన కోరి వెలసిన వాడు
సప్త గిరి శిఖరాన్ని చేర ఊతమిచ్చు వాడు