శివా!ఇక్కట్ల ఇల్లాయె ఈ దేహము
బాధించు చున్నాది భవరోగము
ఛేదించలేకున్నాను ఈ ఖేదము .
మహేశా . . . . . శరణు .
శివా!ఎడతెగని అలలు ఎదను ఆలోచనలు
అవి పుట్టి గిట్టిన వేళ నిన్ను చుట్టనీ
నా చుట్టలన్నీ వీడి అవి నిన్ను ముట్టనీ
మహేశా . . . . . శరణు .
శివా! పదార్ధం నిన్ను చేరితే ప్రసాదం
ప్రసాదం నన్ను చేరితే నీ కటాక్షం
ప్రసాదం అందనీ నీ కటాక్షం పొందనీ
మహేశా ..... శరణు
నిన్ను చేర కోరింది నా సంకల్పం
నీ సంకల్పంతో సిద్ధించనీ నా సంకల్పం
మహేశా . . . . . శరణు .
No comments:
Post a Comment