Tuesday, November 9, 2021

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా!నీ గుడిలో దీపంగా నన్ను వెలగనీ
నా గుండెల్లో దీపంగా నిన్ను తెలియనీ 
ఆ వెలుగు బాటలో నే గమ్యం చేరనీ
మహేశా .....శరణు.


 శివా!ఈ జీవిని నీ ముందు నిలిపినా
పశువునని ఏ మందను కలిపినా
అది నా భవరోగానికి మందే
మహేశా . . . . . శరణు .

శివా!అసమానతలన్ని ఆవిరైపోగా
భేదములన్ని బూడిదైపోగా
చేర వచ్చేవా నన్ను నీలో చేర్చుకొనగ
మహేశా . . . . . శరణు .


శివా!గుడిలోన నిన్ను చూసి
గుండెలో చూడాలని తపిస్తున్నా
తపన తెలిసిన నీవు తెలియరావా
మహేశా . . . . . శరణు


 శివా!విలాసమెరుగని నీ విలాసము
ఈ విశ్వమెరిగిన ఆ కైలాసము
అది తెలిసిన ,తలచిన ప్రమోదము
మహేశా . . . . . శరణు .


 శివా!నీ దండయాత్ర దండించడానికా
దరి చేర్చుకోవడానికా దేనికైనా
అగ్ని కన్ను చాలు ఆయుధమేల
మహేశా . . . . . శరణు .


 శివా!నమః శివాయ నమః శివాయ అంటున్నా
నకార మకార మమకారం తొలగించమంటున్నా
తొలగించవయ్యా నన్ను కరుణించవయ్యా
మహేశా   . . . శరణు .

శివోహం

శివోహం

శివా!నీ గుడిలో దీపంగా నన్ను వెలగనీ
నా గుండెల్లో దీపంగా నిన్ను తెలియనీ 
ఆ వెలుగు బాటలో నే గమ్యం చేరనీ
మహేశా .....శరణు.

శివోహం

శంభో...
కళ్ళుమూసుకొని పంచాక్షరీ చదువుతుంటే
మనసులో ఎదురుగా కైలాసం...
హిమాలయాలు ఎన్నో శిఖరాలు...
ఇదొక్కటే పూర్వ జన్మలో నేను చేసుకున్న పుణ్యం...
చాలా ఆనందంగా ఉంటుంది...
అయిపోగానే షరా మామూలే...
ఎలా శివా నిత్యం నిమిష నిమిషం నిన్ను దర్శించేది...

మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

రాశులు 12
గ్రహాలు 9
జనన సమయం లగ్నం
లగ్నాధిపతి, రాశ్యాధిపతి, గ్రహాల చెలిమి, వైరములు
ఇవేమి తెలియవు నాకు..
నాకు తెలిసింది నీమాట, నీపాట.
ఎలా ఆడిస్తే అలాగే ఆడతాను
గెలిచిన, ఓడినా నీదే భారం
నీట ముంచుతావో,పాలముంచుతావో, 
గంగలో ముంచి మోక్షమే ఇస్తావో నీపై భారం వేసా..
భరోసా ఈయవయా మహేశా...

మహాదేవా శంభో శరణు...

Sunday, November 7, 2021

శివోహం

శంభో...
నీ సన్నిదేనా పెన్నిధి...
మౌనంగా నా వేదన నీకు నివేదన...
ఒకే ఒక కోరిన తండ్రి
అన్యమాలోచించని మార్గం ఉపదేశింవా...

మహాదేవా శంభో శరణు...
సర్వేశ్వరా శరణు.

శివోహం

శివ తత్వం అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు...
శివ అన్న పిలుపుతో ఒళ్ళు పుల కరిస్తుంది...
ఏదో తెలియని ఆకర్షణ...
మనసును ఇట్టే లాగేస్తుంది....
శివ నామ జపం ఎన్ని సార్లు చేసిన తనివి తీరదు...

ఓం శివోహం... సర్వం శివమయం

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...