Sunday, November 28, 2021

శివోహం

శంభో...
ఈ దేహం శిధిలమవ్వకముందే
నా హృదయమందున్న నిన్ను చూడాలి...

మహాదేవా శంభో శరణు.

శివోహం

మురికి కొంపగ పేరు పొందిన దేహం....
నిన్ను పూజించడం...
నిత్యం నీ నామ స్మరణా చేయడం 
వల్లే వెలిగిపోతోంది తండ్రి...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

అయ్యప్ప

మురికి కొంపగ పేరు పొందిన దేహం....
నిన్ను పూజించడం...
నిత్యం నీ నామ స్మరణా చేయడం 
వల్లే వెలిగిపోతోంది తండ్రి...

హరిహారపుత్ర అయ్యప్ప శరణు...

శివోహం

ఉన్నదీ ఉన్నది...
ఉన్నది నేను అయి ఉన్నది...
ఉన్నది ఇప్పుడూ ఉంది...
ఉన్నది మరణం తర్వాత ఉంటుంది...
ఉన్నదిలో ఉన్నది ఉండడంకోసమే సాధన...
                                                 - రమణ మహర్షి

శివోహం

రూపాలు ఎన్ని ఉన్నా...
నామాలు ఎన్ని ఉన్నా...
మార్గాలు ఎన్ని ఉన్నా...
గమనాలు  ఎన్ని ఉన్నా...
బోధలు ఎన్ని ఉన్నా...
కథనాలు  ఎన్ని ఉన్నా...
సాధనాలు ఎన్ని ఉన్నా...
శోధనలు  ఎన్ని ఉన్నా...
ఉన్నది పరబ్రమ్మం ఒక్కటే తుదకు అందరి గమ్యం ఒక్కటే...
ఓం శివోహం సర్వం శివమయం

Saturday, November 27, 2021

శివోహం

దేహమను క్షేత్రంలో
భగవత్స్వరూప స్మరణ లేక ఆత్మభావనయు
ప్రేమ అను జలాభిషేకమును
శాంతము, దయ, సత్యం, వైరాగ్యం, తపస్సు అనెడు పుష్పములను
సర్వేశ్వరధ్యానానందం లేక భక్తితో మునిగిన హృదయామృతమగు నైవేద్యమును ఉన్నప్పుడే మానవజన్మ సార్ధకత....
లేనిచో మానవజన్మ వ్యర్ధం.
 
- మహర్షి సద్గురు శ్రీ మలయాళస్వాములవారు   

Friday, November 26, 2021

శివోహం

జన్మజన్మ పాపాలు
నన్ను వెంటాడు చుండగా 
శాపములా కోపం
నన్ను చుట్టు ముట్టు చుండగా   
ధైర్యము అందించే నా మనస్సులో నీ ఉండగా  
నీ నామ జపమే నాకు రక్షణగా ఉన్నది శివ...

మహాదేవా శంభో శరణు.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...