Sunday, December 12, 2021

శివోహం

నా మనసు నీ మాయజాలలో విహరిస్తుంది...
నా హృదయము నీకై తపిస్తూ నిన్నే జపిస్తూ....
నిన్ను చూడాలని కలవరపెడుతోంది...
నీ పిలుపు కోసం వేచి ఉన్నా...

పరుగున చేరుటకు సదా సిద్ధం...
ఆజ్ఞాపించవేమి తండ్రి.....
నిన్ను చూసి తరించే భాగ్యాన్ని 
నాకు కల్పించవేమి శివ...

మహాదేవా శంభో శరణు...

శివోహం

అడ్డనామాలవాడు ఆదుకొనెడి దేవుడువాడు
ముక్కంటివాడు ముల్లోకములనేలువాడు
జంగము ధరించినవాడు జగమునేలే దేవుడువాడు
కాటికాపరివాడు కలియుగదేవుడేవాడు...
సిరులనిచ్చే దేవదేవుడు...

హర హర మహాదేవ శంభోశంకర...
ఓం శివోహం... సర్వం శివమయం

Saturday, December 11, 2021

శివోహం

శరణం శరణం భవతరణ....
శబరిగిరీశా అయ్యప్ప....
శుభదం శుభదం నీ చరణం...
హరిహరపుత్ర అయ్యప్ప...

ఓం శ్రీ స్వామియే శరణం ఆయ్యప్ప

శివోహం

నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు...
నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు..
రాలేదని కృంగిపోకు...
వచ్చిందని పొంగిపోకు...
జరిగేవన్నీ నీ ఖర్మలో భాగమే కానీ జరిపించేదంతా భగవంతుడే...

ఓం శివోహం... సర్వం శివమయం

Friday, December 10, 2021

శివోహం

దేహి దైవాన్ని  నిత్యం దర్శించాలి
స్పృశించాలి సేవించాలి  సంభాషించాలి  
సాష్టాంగ పడాలి సమాధన పడాలి
తన వేదనను రోదనను వాదనను  
అర్తిని అర్థ్రతను స్వామి ముందుంచాలి
సాయంకోరాలి అహంకారం  వీడాలి
సంస్కారం పరిమళించాలి
ఆశలను తిరస్కరించాలి 
సహకారాన్ని  స్వీకరించాలి
ఓంకారంతో నమస్కారం సమన్వయపడాలి 
ప్రియంగా మాట్లాడాలి హితంగా పలుకరించాలి
మనచేతలు పరహితంకావాలి
మన స్వార్థం మరొకరికి అపకారం కారాదు
ఉపచారాలు ఉపకారాలు
తుష్టిని  పుష్టిని కల్పిస్తాయి  
సాత్త్వికతం అనుసరించినవారికి 
ఉద్వేగాలు ఉద్రేకాలు  అంతరిస్తాయి
మనసులు ప్రసన్నమవుతాయి
అప్పుడే మనలోని  భక్తి భావనకు అర్థం ఉంటుంది
బ్రతుకు పరమార్థం సార్థకమవుతుంది...

ఓం శివోహం... సర్వం శివమయం

శివోహం

ఎక్కడో దూరాన కూర్చున్నావు...
కుటుంబ సభ్యులందరున్నా ఒంటరిగా మాకొరకు తపస్సు చేస్తూ...
నిన్నన్వేషించాలని నేనూ తపస్సు చేద్దామని కూర్చుంటే బంధాలు బంధువులు బాంధవ్యాలు నిన్ను చేరనీయక అడ్డుకుంటున్నాయి...
నిను కనుగొనే దారిచూపవా పరమేశ్వరా...

మహాదేవా శంభో శరణు...

శివోహం

మీరు ఆనందంగా ఉన్నప్పుడు...
ప్రపంచం అంత ఆనందంగా కనిపిస్తుంది...
ఓం నమః శివాయ.
Sadhguru

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...