Sunday, January 9, 2022

శివోహం

మనం అంతమయ్యే వరకు...
అన్ని అనుభవించాల్సిందే...
అవి  బాధలైనా ,సంతోషలైన...
ఎందుకంటే ఆపదకి  సంపద నచ్చదు...
సంపదకి బంధాలు నచ్చవు...
బంధాలకి  బాధలు నచ్చవు...
బాధలు లేని బ్రతుకే లేదు...
బ్రతుక్కి చావు నచ్చదు...
ఇన్ని నచ్ఛకున్నా మనల్ని నలుగురు మోసే వ్యక్తుల మనసులో ప్రేమ సంపాదించనప్పుడు మనం  బ్రతికివున్న శవమే....
ఓం శివోహం... సర్వం శివమయం

Friday, January 7, 2022

శివోహం

హరి నామమే కడు ఆనంద కరము...
హరి నీ సాక్షాత్కారము సకల పాప హరణం...
హరి నీ దర్శనం ,భవరోగ నివారణం...
హరి నీ స్మరణం పూజనం ,సేవనం , జన్మ జన్మల పుణ్యఫలం...

ఓం నమో వెంకటేశయా
హరే గోవిందా...
ఓం నమో నారాయణయా నమః
హరే రామ హరే క్రిష్ణ
క్రిష్ణ క్రిష్ణ హరే హరే

శివోహం

ఆశగా వున్నాది శివా నిన్ను ఒకసారి చూడాలని
నీ సన్నిధిని చేరి కనులార నినుచూసి ఈ జన్మ తరియించి పోవాలని...

కనులెదుట కాలమే పరుగు తీస్తున్నాది తనువులో కండలే కరిగి పోతున్నాయి ఏ జన్మ శాపమో ఏమి గ్రహచారమో బంధాలనే వీడి కదలలేకున్నాను

మహాదేవా శంభో శరణు...

Thursday, January 6, 2022

శివోహం

అంటరాని తనం అంటని చోటు అది...
కుల మతాలు కనిపించని చోటు అది...
నా ప్రాణనాధుడు ఉండే చోటు అది...
అదే అదే నా శాశ్వత నిలయం అది...


ఓం శివోహం... సర్వం శివమయం

Wednesday, January 5, 2022

శివోహం శివోహం

అయ్యప్పస్వామి నీ అనుగ్రహం
అద్భుతం, అమోఘం...
స్నేహితుడై
సహచరుడై
బంధువై
ఆత్మీయుడై
ఆంతర్యామియై నిలిస్తే ఇక నా బ్రతుకులో లేమి అనేదే లేకుండా పోతుంది తండ్రి.

హరిహర పుత్ర అయ్యప్ప శరణు.
ఓం శభరీశ్వరాయా నమః.

శివోహం

పగవారిని గెలవాలంటే మంచితనం కావాలి...
తనవారిని గెలవాలంటే మంచిధనం కావాలి...
తనను తనే గెలవాలంటే శివా కృపే కావాలి...
ఓం నమః శివాయ

Tuesday, January 4, 2022

శివోహం

 శివా!బయటకి వస్తే చూద్దామని  నేను
లోపలకి వస్తే కనబడదామని నీవు
ఎదురు చూపులే ఇద్దరివీ
మహేశా . . . . . శరణు .


 శివా! కనిపించగ వీలుపడదంటావు
అనిపించటం నీ పనికాదంటావు 
మరి నాకు ఎలా తెలియ వస్తావు
మహేశా ..... శరణు.


 శివా!నీవైన విశ్వాన్ని ఈ కనుల చూస్తున్నా
విశ్వమైన నిన్ను చూడలేక పోతున్నా
చూపునీయవయ్యా...చూడనీయవయ్యా
మహేశా . . . . . శరణు .


 శివా!ఋబు గీతను విన్నాను
ఋజు మార్గము గన్నాను
ఋషిగా నన్ను మలచు కొన్నాను
మహేశా . . . . . శరణు .


శివా!ఒంటిగా నను పంపి వెంట నీవన్నావు
సత్య ధర్మముల వెంట సాగిపోమన్నావు 
తెలియలేదంటె శోధించమన్నావు
మహేశా ..... శరణు.


 శివా!ఈర్ష్యా ద్వేషాలు ఎదగనీకు
కామ క్రోధాలు  రగలనీకు
మధ మాత్సర్యాలు  సోకనీకు
మహేశా .... శరణు.



శివా!ఆగలేక సాగుతున్న కాలం
సాగ లేక ఆగివున్న నీకు వశము
కాదనగ ఎవరి వశము
మహేశా . . . . . శరణు.


శివా!గత జన్మ గురుతు రాదు
మరు జన్మ తెలియ రాదు
ఏమిటో ఈ జన్మ యాతన .
మహేశా . . . . . శరణు .

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...