శివా!పరమాత్మ జీవాత్మ సంకేతము
సూక్ష్మ శ్రేష్ఠముల నీవె శోభాయమానము
ఆత్మ జ్ఞానము తెలుపు ఒక పాఠము
మహేశా . . . . . శరణు .
శివా!బ్రతుకు ఏమిటో తెలిసేది
బ్రతుకేమిటో తెలిపేది
ఈ జ్ఞాన వాకిటే....
మహేశా . . . . . . శరణు
శివా!జన్మకు మరణం వరం
పుర్రెకు మరుపు వరం
నాకు నీ స్మరణ వరం
మహేశా.....శరణు.
శివా!ఎన్నేన్నో రూపాలు అన్నీ నీ ప్రతిరూపాలు ప్రతి రూపం ప్రత్యేకం ప్రభవించగ నీ తేజం
ఆ తేజం అనంతం అది నీకు సొంతం
మహేశా . . . . . శరణు.
శివా! ఏది ఒకటి ఏదో ఒకటి
స్ఫురింప చేయి ... సర్వదా
నిన్ను తలిచేలా నిన్ను తెలిసేలా
మహేశా. . . . .శరణు..
శివా!బరువైన ఈ తలను తొలగించవయ్యా
నీ తల వాకిట ఆ తలను తగిలించవయ్యా
తల కలిగినందరూ తెలుసుకొనంగ.
మహేశా . . . . . శరణు.
శివా!మంగళ కారకా ఓ లింగమూర్తి
ఎంగిలి కాని రీతి నిన్ను ఎలుగెత్తి పిలిచాను
ఎఱుక రావయ్యా కినుక చాలయ్యా