Wednesday, February 23, 2022

శివోహం

శివా!నీ సిగ వెన్నెలకు  నెలవయ్యింది
నీ కరుణను తెలిపెడి ఋజువయ్యింది
నీ శరణము వేడగ అభయమయ్యింది
మహేశా . . . . . శరణు .

శివోహం

ఒక్కసారి ఓం నమః శివాయ అనండి...
స్వచ్ఛమైన ఆ పేరులోనే...
దాగుంది జీవితం అంతా...
ఆ నామాన్ని స్మరిస్తే చాలదా...
మనకి జీవితం ఆనందమయం కదా మిత్రమా...

ఓం శివోహం... సర్వం శివమయం.

Tuesday, February 22, 2022

శివోహం

శంభో...
నన్ను దిద్దుకో...
నీ దాసునిగా మలచుకో...
నీవాడిగా చేసుకో...
నేను నిన్ను మరిచిపోకుండా గుర్తు చేస్తూ...
నీ భక్తజనం లో ఒకడిగా నీవు నన్ను గుర్తు పెట్టుకో...
నీ గుండెలకు హత్తుకో...
నీ చెంత నిలుపుకో...

మహాదేవా శంభో శరణు.

శివోహం

శివా!చిత్తంలో చిరు దీపమై వెలిగేవు
విశ్వంలో విరాట్ తేజమై ప్రభవించేవు
రెండూ అభేదమే ఆ ఎఱుక ప్రమోదమే
మహేశా . . . . . శరణు .

శివోహం

బంధాలు కొన్ని ఋణాలు తీరగానే బంధ విముక్తి అవుతాయి...
వారి నుండి దూరం పెరుగుతుంది...
కొన్ని రుణాలు జన్మ జన్మల నుండి వస్తూ ఉంటాయి...
అవే తల్లిదండ్రుల ఋణం, ఋషుల రుణం,దేవతా ఋణం...
ఇవి ఎప్పుడూ వెంటే ఉంటాయి.
మంచితనం, మానవత్వం, దయ ,పాప భీతి, భక్తి,భయం తో జీవితాన్ని ఆ దేవదేవుని పాదాల శరణు వెడితే జీవితం లో శాంతి ఆనందం లభిస్తుంది...

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, February 21, 2022

శివోహం

పిలవగానే పలికే దేవుడవు...
రాగానే వరాలనిచ్చే హితుడవు...
ఆపదలలో కాపాడే స్నేహితుడవు...
పేదవాడికి సైతం అందుబాటులో ఉండే భోళాశంకరుడవు...
సంపదలెన్ని ఉన్నా, మౌనవిరాగివై లోక కళ్యాణం
కోసం తపమాచరించే మహానుభావుడవు...
ఏతీరున నీతత్వము అర్ధం చేసుకోగలం...
నీరూపు మాటెలా ఉన్నా...
నీ పంచన నిలిచేలా చూడు తండ్రి...

మహాదేవా శంభో శరణు...

శివోహం

శివా!నీ నీడలో నాకు విద్య నీయి
అవిద్య అన్నది తొలగనీయి
మిధ్య ఏదో తెలియనీయి
మహేశా . . . .  .  శరణు .


 శివా!కనిపించే కన్నులు మూసి ఉంచనీయి.
కనిపించని కన్ను తెరిచి చూడనీయి 
నీవు , నేను , తెలియ నీయి
మహేశా . . . . . శరణు


 శివా!ఒక రూపమంటూ లేని నీవు
ప్రతి రూపంలో నీవే వెలుగుతు ఉంటే
నీ ప్రతిరూపం నేను కానా...?
మహేశా . . . . . శరణు .


శివా!నిప్పు కంట నన్ను చూడు చల్లగా 
భక్తి జ్ఞాన కుసుమం విచ్చగా
అందున్న పరిమళాలు విరియగా
మహేశా. . . . . శరణు.


 శివా!ఈ బ్రతుకు బండి పయనంలో  
సాయమూ నీవే సాక్షమూ నీవే 
శోధించి సాదించగ నా లక్ష్యమూ నీవే
మహేశా . . . . .  శరణు


శివా!కైలాసం చేరడం
నా కామ్యము కాదు
అది నా గమ్యం
మహేశా . . . . . శరణు .


శివా!దేహాన్ని దరియించు జ్యోతిగ వెలిగేవు
దేహాన్ని దహియించు జ్వాలగ రగలేవు
రెండూ ఒకటి చేసి ప్రణవాన మెరిసేవు
మహేశా . . . . . శరణు .

శివోహం

ప్రతి ఒక్కరి బతుకులోనూ ఏదో ఒక వేదన ఉంటుంది… తేడా మాత్రం ఒక్కటే... కొందరు రోదిస్తూ చెప్పుకుంటారు… కొందరు నవ్వుతూ దాచుకుంటారు. నేను రెండో రకం.