Saturday, February 26, 2022

శివోహం

నిన్ను ద్వేషించే వారిని నీ ద్వేషం అనే మంటల్లో మసి చేయకు మిత్రమా...

నీ మంచితనం అనే నీడను వారిపై ప్రసారింపచేసి వారి ద్వేషం ను ఆర్పు...

ఎందుకంటే జీవుడే దేవుడు...

ఓం శివోహం... సర్వం శివమయం.

Friday, February 25, 2022

శివోహం

ప్రతి కదలిక ఈశ్వరుడిదే...
జరిగేది జరుగుతుంది...
జరగనిది జరుగదు...
ఇది సత్యం
కనుక మౌనంగా ఉండడం ఉత్తమం...

రమణమహర్షి

శివోహం

నిన్ను నమ్మితే చాలు
గాజు ముక్కలోనూ ఉంటావు
మహాశివా
నిను కొలవాలే గాని
సర్వత్రా నీవే కొలువై ఉంటావు

సదా శివా
నీవు లేనిది ఎక్కడ
గాలి లోనూ నీటిలోనూ
నిప్పులోనూ నింగిలోనూ
అంతటా నీవే నిలచి ఉన్నావు

జగదీశుడవు 
ఆది దేవుడవు
ధర్మార్మ కాల స్వరూపుడవు
నిను పూజించని కరములా ఇవి
కాల సర్పంలా విషం చిమ్మునవి

నిను నమ్మిన వారికి
ఆపన్న హస్తాలు
అభయంకరా శంభో శంకరా
నిను చేర మార్గముపదేశింపరా
హరా పరమేశ్వరా

భద్రుడవు నీవే
రుద్రుడవు నీవే
మంగళాకారుడవూ నీవే
చిదానంద స్వరూపమూ నీదే
అన్నీ తెలిసీ మా పై ఈ పరీక్షలేల

త్రయంబకుడవూ నీవే
అర్దనారీశ్వరుడవూ నీవే
సదా నిర్వికారుడవూ నీవే
భోళా శంకరుడవూ నీవే
కాలుడవు నీవే మహా కాలుడవూ నీవే

సర్వేశ్వరా అంతటా 
నీవే నిండి ఉన్నావు
నిరాకారా నిర్విఘ్నకారకుడివి
సదా నిన్నే స్మరింతు
శ్రీశైల వాసా శ్రీ మల్లిఖార్జునా..!

     

శివోహం

శివా!వేయి జన్మలుగ నిన్ను వెతుకుచున్నాను
ఏ జన్మనూ నిన్నేలో తెలియలేకున్నాను
తెలియవచ్చెడి జన్మ కలుగనిమ్ము
మహేశా . . . . . శరణు.

Thursday, February 24, 2022

శివోహం

శివా!మదన పడుతున్నా మనసు వీడక
ఆ పైన నేను ఎవరో తెలియక
సతమతమవుతున్నాా శరణమంటున్నా
మహేశా . . . . . శరణు .

శివోహం

నాది అంటూ ఎం మిగిలి ఉంది నా వద్ద శివ...
ఒక్క మనసు తప్ప...
అది కూడా నీదే...
అంతా నీవే...
ఇదంతా నీదే...
నీ సొత్తును...
నేనునీకు సంతోషంగా కృతజ్ఞతా పూర్వకంగా  తిరిగి ఇవ్వడానికి  నా దగ్గర ఏమైనా ఉందా పిడికెడు బూడిది తప్ప...

మహాదేవా శంభో శరణు...

Wednesday, February 23, 2022

శివోహం

తొలిసంధ్యలో ఆరవిరిసిన అరవిందాలు మలిసంధ్యలో వాలి రాలిపోవడం సహజం...
అట్లే జనించాక మరణించడం కూడా సహజమే...
ఇది కాలధర్మం...
అయితే ఆ మరణం వెన్నెల్లో పూసిన పారిజాతాలు వేకువలో పరవశంగా పరమాత్మునిపూజకై రాలిపోయినట్లు ఉంటే ఆ జననంకు సార్ధకత ఉన్నట్లే...
ఇక మరుజన్మ లేనట్లే.

ఓం శివోహం... సర్వం శివమయం.

  బాహ్యంలో నా నేను ఊరేగుతూ... అంతరంలో నా నేను కు దూరమై... ఎటూ చేరలేని అవస్థలు, తీరని బాధలు... నన్ను ఓ దరికి చేర్చవా పరమేశ్వరా.. మహాదేవా శంభో...