Friday, March 11, 2022

శివోహం

శివా!నీ పాదాల నలిగినా నీ నాట్యమే చూస్తున్నా
అణిగిందిలే అహమని ఆనందాన పొంగిపోతున్నా
అణగద్రొక్కినట్టున్నా అనుగ్రహంగా తెలుసుకున్నా
మహేశా . . . . . శరణు .

Thursday, March 10, 2022

శివోహం

శివా! నీ స్మరణ కన్న సౌఖ్యమేది 
నిన్ను తెలియుటకన్న  వైరాగ్యమేది
నిన్ను చేరుటకన్న వైభవమేది
మహేశా . . . . . శరణు .

శివోహం

మాయమలినమైన ఈ జన్మకు...
నీ నామ స్మరణతోనే కదా ముక్తికి మార్గం...

మహదేవా శంభో శరణు.

Wednesday, March 9, 2022

శివోహం

నమక చమకలతో సాగె నీ అభిషేకం...
యమక గమనలతో సాగె నీ కీర్తనం...
నిరతిశయా నా ఆనందాలకు చిరునామా...
మహదేవా శంభో శరణు.

శివోహం

శివా!గంగను దరించావో,భరించావో
సోమున్ని సిగలో బంధించావో
శాప బంధమున తృంచావో తెలియకుంది
మహేశా . . . . . శరణు .

Tuesday, March 8, 2022

శివోహం

కష్టాల్లో దేవుణ్ణి కొలుస్తూ...
సుఖాల్లో మరుస్తూ...
ఉన్నాడో లేడో అని అరకొర విశ్వాసంతో జీవనగమనం సాగిస్తే అంత్యకాలంలో స్మరణకు అందడు ఆ అనంతుడు....
కన్నుమూసేవేళ ఆ కారుణ్యమూర్తే కళ్ళముందు కదలాడాలంటే...
మనుగడలో మలుపులెన్ని ఉన్నా మహాదేవుడుని మనసార విశ్వసిస్తూ, మన దైనందిక జీవితంలో ఆ దేవదేవున్ని ఓ ఆలంబనగా ఆరాధనీయునిగా చేసుకొని, సదా సన్మార్గంలో సాగిపోగలిగే సాధనను సాధిస్తే, సర్వవేళల్లో సర్వేశ్వరుడు అంత్యకాలంలో అంతరంగ ఆలయమున అనంతుడై అగుపిస్తాడు, అప్పుడు ఆ అంతర్యామిలోనే మనం ఐక్యమౌతాం.

ఓం శివోహం... సర్వం శివమయం.

Monday, March 7, 2022

శివోహం

అమ్మయే ఆధిదైవం తన కరుణే అపారం...
అమ్మకు ఆదిలేదు రూపాలకు కొదువ లేదు...
అమ్మ పవిత్రులకు పరమాత్మ ,దుష్టులకు అనాత్మ.
అమ్మ అజేయురాలు భక్తికి వశురాలు...
అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే...

ఓం శ్రీమాత్రే నమః.

శివోహం

https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మళ్ళీ జన్మలు ఉన్నా కానీ… మనిషిగ పుట్టే యోగ్యత కలదో లేదో… మళ్లీ నీ సన్నిధి ముంగి...